పుట:Andhrula Charitramu Part-1.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హ్యూంట్జి తప్పించుకుని టిబెట్ దేశమునకు బారిపోయెననియు, ఆదేశపురాజయిన "యెంత్సోగ్లాన్ స్తాన్"(Yetsongloustan)అను నాతడు వారికి గొంతసైన్యము నిచ్చెననియు, అతడాసైన్యముతో మరల వచ్చి పులమాయి శత్రువుని నోడించి వానిని జెర బట్టెననియు వ్రాసియున్నాడు. వీటినన్నింటినిబట్టి చూడగా వీరలకును చీన చక్రవర్తులకు విశేషమైత్రి కలదనియు, ఈ రెండు దేశములకును వర్తక వ్యాపారము జరుగుచుండెననియు దేటపడక మానదు.

పట్టణములు-పల్లెలు.

ఆకాలమున నాంధ్రదేశమందుండిన పట్టణములు పల్లెలు కొన్ని ధాన్యకటక శాసనములలో గానంబడుచున్నవి. "రాజగిరి, కేపూరూరు, మందర, విజయపురము.(బెజవాడ?), ధాన్యకటకము (ధరణికోట), కుట్టపరవేన, మహావనశాల, కూడూరు(బందరు తాలూకాలోని గూడూరు లేక కృష్ణా మండలములోని గుడివాడై యుండవలయును), ఒడి పరివేపన(ఒద్ది పర్రు), సాధుగ, రాజశైలము, కట్కశాల(ఘంటశాల),నడతూరు, మహాకాండూరూరు, మేగిరి" అనునవి మాత్రము పేర్కొనబడినవి. " నందపురము. గిలకేర, నగిరి" అనునవి భట్టిప్రోలు శాసనములలో బేర్కొనబడినవి.

ఆంధ్రులవర్ణనము.

ఆంధ్రులు నాగరికతయందు పెక్కుతరగతులుగ వేరుపడియుండిరి. అనార్యాంధ్రులు నాగరికతయందు వెనుకబడియున్నవారగుట చేత వారు కేవలము దిగంబరులుగా నుండిరని చెప్పవచ్చును. నాగరికులైన నాగులు కొంచెము వస్తాదికము గలిగియుండిరి. వారు ధరించుకొను దుస్తులను, అలాంకరించుకొను నాభరణములు వారి వారి స్థితుల ననుసరించి భేదించి యుండినవి. సాంచి, నాసిక, కార్లి, అమరావతి మొదలగు ప్రదేశములలోని విగ్రహములను జూచిననియెడల వారలంకరించుకొను యాభరణముల వైఖరులు తేటపడగలవు. అంధ్ర స్త్రీ అలంకరించుకొను నాభరణములలో పెద్దవిగను దీర్ఘచతురస్రములుగనుండిన ల్లలతో గూర్పబడి బరువుగను వెడల్పుగనుండు మెడసరము ప్రాముఖ్య