మరియును ఆంధ్రదేశమునకును సుమాత్రాజావా ద్వీపములకును విశేషసంబంధముగలదని కొన్ని హేతువులచే నిశ్చయింపబడుచున్నది. ఈ యాంధ్రరాజులును మగధ రాజులనియు, మహాకర్ణులనియు విదేశస్థులు పేర్కొనుచుండెను. ఒక కర్ణ మహారాజును గూర్చి యాదేశమునందొక కావ్యముకలదట ఆ కావ్యమేదియో తెలిసికొన్నయెడల వీరుల చరిత్రము కొంతవరకు దెలియబడ వచ్చును. ఈ యాంధ్రరాజుల కాలముననే బౌద్ధమతమాదీవులకు వ్యాపించినది. ఈ దేశము నుండి బౌద్ధభిక్షువులును వర్తకులు ననేకులా దేశమునకుబోయి వచ్చు చుండిరని కూడా తేటబడుచున్నది.
ఇంతియగాక యాంధ్రరాజులను గూర్చి చీనాదేశమునందలి చరిత్రములలో బ్రశంసింప బడియుండెను. చీనాదేశపు, చరిత్రకారులు "యజ్ఞాయ్"(Yagnai) అని యజ్ఞ శ్రీశాతకర్ణిని పేర్కొని వానిని హిందూదేశపు చక్రవర్తి యని చెప్పియున్నారు. ఆంధ్రరాజులలో గడపటి వాడయిన పుల్హమాయిని "పౌలోమీన్" (Powlomein)హౌలోమిన్ (Howlomein). హౌలోమిన్ తో(Howlomeinto), అని యా దేశపు చరిత్రకారులు పేర్కొని యున్నారు. ఇండియాదేశమును వారు పులిమాను దేశమని యర్ధము మిచ్చునట్టి పౌలోమిన్ కోనె(Poulomien kove) యని పిలిచి యున్నారు. కడపటి వాడయిన యీ పులమాయి మరణానంతరము దేశమల్లకల్లోలమయ్యేనని "డీ గైన్సు ఓలో నాచెన్" (Diegiunes Olonachen)వ్రాసియున్నాడు. ఈ పులమాయి క్రింది యధికారులలో నొకడు గంగానదీప్రాంతభూముల నాక్రమించుకుని చీనాచక్రవర్తియగు టెయిట్ సాంగ్ (Taitsong) వద్ద నుండి హ్యూంట్జి (Hiuntse)యనువాండు కొందరు రాయబారులతో వచ్చుచున్నాడని విని వారలను బట్టికొనుటకై సేనలను బంపెననియు, బహుకష్టముతో [1]