Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిరి. మహాసాంఘికులన మహాసంఘము యొక్క విద్యాలయమునకు సంబంధించిన వారని యర్ధము. మహాస్థానీరులన మహాధ్యక్షుని విద్యాలయముకు సంబంధించిన వారని యర్ధము. మరల మహాసాంఘీకులు "చైత్యులు (పూర్వశైలులు) అపరశైలులు హైమవతులు, లోకోత్తరవాడినులు, ప్రజ్ఞాప్తివాదినులు అని యైదు తరగతులుగా వేరుపడిపడిరి. చైత్యక పర్వతము మీద నుండు సన్యాసి బోధనము అవలంబించినవారు. చైత్యకులనం బడుచుండిరి. హౌనుత్సాంగు పూర్వ శైలసంహరామమని చెప్పినది. యీచైత్యకులకు సంబంధించినదిగ నేల చెప్పరాదని డాక్టరు బర్మెస్సుగారు ప్రశ్నించుచున్నారు. [1] పూర్వశైలులులో భేధించినవారపర శైలు లనంబడుచున్నారు.

బ్రాహ్మణమతము.

ఆంధ్రులు ఆంద్ర్హరాజులును, బౌద్ధమతాభిమానులును. బౌద్ధమతావలంబకులు నైనను ఆంధ్రరాజుల పాలనమున బౌద్ధమతముతో బాటు బ్రాహ్మణ మతమును వర్ధిల్లుచుండెను. బౌద్ధులయిన యాంధ్రరాజు లెప్పుడును బ్రాహ్మణమతము పట్ల ద్వేషమును జూపినట్లెక్కడను గానరాదు. మరియు గోతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణజాతిని సాంకర్యము నుండి సంరక్షించెనని నాశికశాసనము నందు జెప్పబడియుండుట చేత గోతమీ పుత్రుడు బ్రాహ్మణమతాభిమానియని కొందరు తలంపవచ్చును గాని నిజముగా నాతడు మతసహన బుద్ధికలవాడె గాని బ్రాహ్మణమతాభిమాని గాడు. యవనశక పహ్లవాదులు మొదలగు విజాతీయులు పెక్కండ్రు బ్రాహ్మణమతావలంబీకులై కొందరు బ్రాహ్మణులమనియు కొందరు క్షత్రియులమనియు జెప్పుకొనుచు బ్రాహ్మణ సంఘమును సాంకర్యమునొందించు నప్పుడట్టి సందర్భముల గోతమీ పుత్రుడు కలుగజేసుకొని బ్రాహ్మణజాతికి భంగము కలుగకుండ వచ్చెననుటకును సందియముండదు. కాబట్టి యాకాలమందు బ్రాహ్మణ బౌద్ధమతముల రెంటికిని శత్రుత్వం లేక పోవుటయే గాక యన్యోన్యమైత్రి కూడా కలదని చెప్పుటకు సంశయించవలసిన పని లేదు.

  1. 1.Archelogical Survey of Southern India Vol Ip 24.