పుట:Andhrula Charitramu Part-1.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దేశమునజొరబడి కల్లోలము గావించిరి. తుదకు నాంధ్రుల పరిపాలనమునకు లోబడి దేశమున స్థిరనివాసములేర్పరచుకొని దేశమతమును దేశాచారములను బూని దేశీయులలో గలిసిపోయిరని యిదివరకే పూర్వప్రకరణముల దెలుపబడియెను. పైజెప్పినగుహలలోని శాసనములలో బుద్ధధర్మప్రచారమునకై దానముచేసిన వారిలో యువకులయొక్కయు శకనుల యొక్కయు నామములు కూడా లిఖింపబడి యుండుటయే యిందుకు ప్రబలసాక్ష్యముగానుండెను. బౌద్ధభిక్షువులు నిచసించుటకొరకు శిలామఠములలో గదులేర్పరుపబడినవి. ఈ బౌద్ధసన్యాసులు సాధారణముగా దేశాటనము చేయుచు వర్ష కాలముల యందు నీకొండగుహలలో నివసించుచుండిరి. శ్రావణమాసములో బౌద్ధసన్యాసులు ప్రాతదుస్తులను విడిచి క్రొత్త దుస్తులను ధరించుచుండిరి. పరోపకార బుద్ధి కలవారు వీరికి దుస్తులను బహుమానముగా చేయుటకు గొంతధనమును గ్రామసంఘముల కడ నిలువజేయుచుండిరి. ఆసంఘములవారు మూలధనమును వెచ్చింపక వాని వడ్డి మాత్రమీ ధర్మకార్యముల కొరకు వినియోగించుచుండిరి. ఇటువంటి మతకార్యముల నిర్వాహముకొరకు రాజులును రాజకీయోద్యోగస్థులును గ్రామముల నిచ్చి వేయుచుండిరి. మతబోధకులయిన సన్యాసులు తరచుగా సముద్రయానము సలుపుచుండిరి. కాబట్టి డాబోల్, బాంకోట్, రాజపురి కయ్యలకడ వరుసగా చిప్లన్, మహాడ్, కూడం అనుప్రదేశముల కడ నట్టి గుహలు కలవు. ఘోడ్బందరు కడ దిగువారికి కంహేరిగుహలు కలవు. ఇంతియగాక యాంధ్రదేశమునందును బెజవాడ, అరుగొలను, గుంటుపల్లి, శ్రీశైలము, మొగలరాజపురము, మొదలగు తావులను కొండగుహలు తొలువబడియుండినవి. ఆంధ్రరాజుల పరిపాలనమున సమస్త విధముల చేత బౌద్ధమతమౌన్నత్యదశ ననుభవించెననుటకు లేశమాత్రమును సందియము లేదు.

బౌద్ధమత భేదములు.

బౌద్ధమతాచార్యులు స్వల్పవిషయములలో భేదాభి ప్రాయముగలిగి యుండి మహాసాంఘికు లనియు, మహాస్థావీరులయు రెండుతెగలుగావిడిపో