పుట:Andhrula Charitramu Part-1.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప స్తూపమును విడిచి యే విధము చేతను మనోహరముగానుండని బెజవాడ గుహలను వర్ణించియుండెనని చెప్పుట పొసగియుండలేదనియు, అమరావతీ స్తూపములోని విగ్రహములను బోలు నొక్క విగ్రహమైన ఒక్క శాసనమైన గంటికి గానరాదనియు, ఏడవశతాబ్దమునందుండి వ్రాసిన వ్రాతలో బొరపాటు లుండవచ్చుననియు, హౌనుత్సాంగు వాక్యములను భాషాంతరీకరించిన బీల్ గారి భాషాంతరీకరణమునకు ను జ్యూలియును గారి భాషాంతరీకరణమునకును భేదమున్నదనియు మొదలగు విషయముల నెన్నిటినో చర్చించి స్యూయలుగారి వాదమును బూర్వపక్షము చేసియున్నారు.[1]

ధాన్యకటకమును బాలించిన యాంధ్రరాజుల పేరులను, ధాన్యకటకమును పేరును అమరావతీస్తూపములో గానవచ్చినవి, ఆంధ్రుల శాసనములు మాత్రమె కాక వారితరువాత పాలనము చేసిన యాంధ్ర పల్లవుల శాసనములగూడ అమరావతియందు గానుపించినవి. ధాన్యకటక నగరములోని బుద్ధుని చైత్యమును సందర్శించి బుద్ధునికి నమస్కరించుటకై వచ్చితినని చెప్పి పల్లవరాజగు సింహవర్మయొక శాసన మొక స్తంభము పైని వ్రాయించెను. ఆ స్తంభముకూడ అమరావతి లోని మంటిదిబ్బలో నుండి పైకిదీయబడినది. నవీనులు కూడ ధాన్యకటకము ధరణికోటయనియే భావించుచుండిరికాని బెజవాడయని భావించుచుండలేదు. కాబట్టి హౌనుత్సాంగు వ్రాసిన వ్రాతయని చెప్పెడి పరస్పర విరుద్ధములయిన కొన్ని వాక్యములను బట్టి బెజవాడయే ధాన్యకటకమని భావించుట భ్రమకాని వేఱొండుకాదు.

- - - -

  1. గ్రంథ విస్తర భీతిచేత వీరి చర్చలను సంపూర్ణముగ దెలుపజాలక సంగ్రహములుగా వారి భావములను మాత్రము దెలిపితిమి.