పుట:Andhrula Charitramu Part-1.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శైల సంఘారామము బెజవాడకు బడమటనున్న కొండపై నున్నదనియు, ధాన్యకటకమునకు దక్షిణముననున్న కొండగుహలలో భావవివేకస్వామి తపస్సు చేసికొనుచున్నాడని యాయాత్రికుడు వచించియున్నానడనియు, అదియె బెజవాడకు దక్షిణ భాగమునందుండిన ఉండవిల్లి కొండ యనియు అపరశైల సంఘారామము అమరావతీ స్తూపమె యైనయెడల నచ్చట కొండలేవియు లేకుండుటకు గారణమేమియనియు, చుట్టును గొండలేవియును లేక వట్టిబయలులో నుండుటచేత నయ్యది ధాన్యకటకము కాదనియు, కొన్ని నెలలు నివాసము చేసియుండిన హోనుత్సాంగు వర్ణించిన వర్ణనలకు బెజవాడ మాత్రమె సరిపోయియుండుటచేత ధాన్యకటకనగరము తప్పక బెజవాడయే యగునని తమయభిప్రాయమని స్యూయలు గారు కంఠోక్తిగ జెప్పియున్నారు. [1] అయినను భరతఖండము నందలి బౌద్ధుల స్తూపములను, బౌద్ధులగుహలను, పర్వతములలో డొలువంబడిన పురాతన దేవాలయములను బరిశోధించి వానింగూర్చి గ్రంథములను వ్రాసిన డాక్టరు ఫర్యూసను గారు స్యూయలుగారి వాదము నొప్పుకొనక ఖండించి ధరణికోటయే ధాన్యకటకమని సిద్ధాంతీకరించి యున్నారు. వీరివాదమె విశ్వసనీయ మైనదిగ గన్పట్టుచున్నది. చీనాయాత్రికుని వ్రాత సందిగ్ధముగ నున్నదనియు, వారు కండ్లతో జూచి వ్రాసియుండిరో వినికిడినిబట్టి వ్రాసియుండిరో నిజము తెలియరాదనియు, అపరశైల సంఘారామమును గూర్చి వర్ణించిన వర్ణన అమరావతీస్తూపమునకు సరిపోవుచున్నది గాని బెజవాడ కొండలమీది గుహలకువర్తించుచుండలేదనియు, ఉండవల్లి కొండగుహలు పౌరాణిక సంబంధమైనవిగాని పురాతన బౌద్ధమత సంబంధమైన గుహలు కావనియు, అందలి యనంతశయనుని దేవాలయము నవీనమైనది గాని మిక్కిలి పురాతనమైనది కాదనియు, హిందూదేశమునందుండిన బౌద్ధవిహారము లన్నిటితో బోల్చి చూచినపుడు బెజవాడగుహలు భేదించినవిగా నున్నవనియు అమరావతీస్తూప మట్లుగాక సార్వవిధముల చేతను తక్కినవానింబోలియున్నదనియును, ఇంతియగాక హిందూదేశమునందలి స్తూపములలో బ్రధానమైనదిగా నుండి దేశస్థులకు దిగ్భ్రమగొల్పెడి సమీ

  1. Mr. Sewell's Dhanyakacheka.