యున్నవి. తరువాత నివి కర్నలు మెకంజీగారి దృష్టి నాకర్షింపగా వారు దీని వృత్తాంతము నంతను వ్రాసి "ది ఏషియాటిక్ సొసయిటీ ఆఫ్ బెంగాల్" అను సంఘమునకు (The Asiatic Society of Bengal) బంపించిరి. [1] అటుపిమ్మట మరికొంతకాలమున కనగా 1812 న సంవత్సరమున వారు మరల నా స్థలమునకు విచ్చేసిరి. అప్పటికి వారు "సర్వియర్ జనరల్ ఆఫ్ మెడ్రాస్" అను నుద్యోగపదవికి వచ్చిన వారగుటచేత దీపాలదిన్నెలోపల నుండిన చైత్యమును బయలుదీయుటకు దమ స్వాధీనములో నుండిన సాధనముల నన్నిటిని రెండు సంవత్సరముల వరకు నుపయోగపరచు చుండిరి. దీపాలదిన్నెకు "హిల్ ఆఫ్ లైట్సు"(Hill Of Lights) అని పేరు పెట్టిరి.
అమరావతి చైత్యము యొక్క ప్లానులును, చుట్టునుండి ప్రదేశములయొక్క పటములును, రాతి పలకలపై జిత్రింపబడిన 80 విగ్రహముల యొక్క పటములును మిక్కిలి జాగరూకతతో వ్రాయించుటయె వీరి కృషి యొక్క ఫలితముగా నున్నది. ఈ పటములును వీరికి సహాయకారులుగా నుండి హామిల్టను, న్యూమాన్ బర్కు అనువారు మిక్కిలి యందము గాను, రూపభేదము లేకయుండ సరిపోవునట్లుగను వ్రాసియుండిరి. ఆ పటములయొక్క ప్రతినొకదానిని పైజెప్పిన "ది ఏషియాటిక్ సొసయిటీ ఆఫ్ బెంగాల్" అనుసంఘమునకును రెండవప్రతి మద్రాసులో నుంచుటకును మూడవప్రతి ఇంగ్లాండులోని డైరెక్టర్లకును బంపించిరి. మూడవప్రతిని డైరెక్టర్ల పుస్తక భాండాగారమున నిప్పటికిని జూడవచ్చును. వీనివివరమును వర్ణించుచు వ్రాసిన చరిత్ర మేదియును బంపబడనందునను అచ్చటి వారు దీని నవగాహాము చేసికొని గ్రహించుట గష్టముగ నుండుట చేతను వీనినిగూర్చి యెవరను నాలోచింపనైరి. 1837వ సంవత్సరమున వానిలోని రెండు శాసనములను ప్రిన్సెప్ గారి పత్రికయందు భాషాంతరీకరించి ప్రచురించుటతక్క మరేపనియును జరిగియుండలేదు. అయినను అదృష్టవశము చేత సర్ వాల్టరు ఎలియట్ దొరగారు1840 వ సంవత్సరమున
- ↑ See Asiatic Researches vol IX page. 272