పుట:Andhrula Charitramu Part-1.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాశము చేయబడుటవలన [1] భూమిలో బాతుకొనిపోయి మంటిదిబ్బలచే కప్పబడి సామాన్యదృష్టికి గానరాక మరుగుపడి యుండుటచేత అస్సీరియా మంటిదిబ్బలలో బాతుకొనిపోయి మంటిదిబ్బలచే గప్పబడి మరుగుపడియుండిన బోతా లేయార్డులవలెనె యూరుపేరు లేక యుండెను. అదృష్టవశముచేత వర్షము గురిసినప్పు డేరాతిపలకయైన బయల్పడెనేని అచ్చటి నివాసస్థుకేద్వారబంధము క్రిందనో వేసికొనుట గాని యేసున్నము కొరకు కాల్చివేయుటగాని తటస్థమగుచుండెను. అందువలన కట్టడము యొక్క నడిమిభాగము నిలిచియుండలేదు. కర్నల్ మేకంజీదొరగారు క్రీ.శ.1797 వ సంవత్సరము లో జిల్లాలో సంచారము చేయునపు డీయమరావతీస్తూపము వారిదృష్టి నాకర్షించినది. అంతకు రెండుమూడుసంవత్సరములకు బూర్వము చింతపల్లి రాజుగారగు శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బహాదూర్ గా రాస్థలమునందుండిన అమరేశ్వరాలయముయొక్క మహాత్మ్యముచే నాకర్షింపబడి యచ్చటనొకపురమున నిర్మించి తనకు రాజధానిగ జేసికొనవలయునని నిశ్చయించి తన నూతన రాజధానీనగరమున రాజభవనము నొకదాని గట్టుటకై తాళ్లు కావలసి దీపాలదిన్నెయును మంటిదిబ్బను మరికొన్ని సమీపమునందలి దిబ్బలను త్రవ్వ నారంభించెను. తన చే గట్టబడుచున్న అమరావతికి బడమట ఒక మైలు దూరమున నున్న ధరణికోట యొక్క పురాతనపు గోడలనుగూడ విడియగొట్ట నారంభించి వానింగూడ నుపయోగపరచుకొనుచుండెను. ప్రాచీనము లయిన రాతిపలకలు విగ్రహములు మొదలగు ననేకములు నాశము చేయబడి గొనిపోబడినవి. దేవాలయములకును భవనములకును పెద్దపెద్ద రాళ్లు పెక్కులు రాజాగారిచే గొనిపోబడినవి కాని విగ్రహములు చిత్రింపబడిన రాతిపలక లనేకము లింకను మంటిదిబ్బలలో బూడ్చుకొని పోయి

  1. అయిదవశతాబ్దమునందుండిన నాతాపిపురాధీశ్వరుండును పశ్చిమ చాళుక్యరాజు నగు మొదటి పులకేశివల్లభునిచే అమరావతీ స్తూపము నాశము చేయబడినదని యొక శాసనముబట్టి తెలియుచున్నది.