పుట:Andhrula Charitramu Part-1.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యనియు సాధారణముగా వర్ణించియున్నారు. పదునొకండవ శతాబ్దమునకు బూర్వమున నుండెడి తామ్రశాసనము లన్నిటిలోను శకనృపకాలమని కన్పట్టుచున్న దనియు, బాదామి యను ప్రదేశము నందలి యొక శాసనములో శకరాజుయొక్క పట్టాభిషేకము మొదలుకొని ప్రారంభమైన కాలమని (శకకాలము) వ్రాయబడి యున్నదనియు, ఆ శకశబ్దమే తరువాత మరియొక యర్థమున వాడబడుచున్నదనియు, మొదటిదానిని మరచిపోయిరనియు, తరువాత వారీశకము నెవ్వరిదో యొక గొప్పరాజునకు ముడి పెట్టవలసివచ్చి శాలివాహనశకమని శాలివాహనుని పేరుతో ముడిపెట్టివాడుచున్నారే గాని శబ్దార్థప్రకారము చూచిన పక్షమున నందర్థము లేదనియు, రెండు రాజకుటుంబముల గలసిన పేరుగా నున్నదనియు డాక్టరు భాండార్కరుగారు నుడువుచున్నారు. [1]

ఎవరివాదమెట్లున్నను శాలివాహన శకమెవ్వని పేరుతో ముడివెట్టినను, మొదటినుండి గాకపోయినను కొన్ని శతాబ్దముల క్రిందటనుండి యైనను వ్యవహారములోనికి వచ్చినది గనుక మన మీ శకమును శిరసావహింపవలసిన దనుటకు సందియము లేదు. ఇది మొదటి సౌరాష్ట్రమాళవ దేశపు క్షా త్రపులచే బ్రారంభిపబడినెది గాని యాక్షాత్రపుల రాజ్య మంతరించిన వెనుక విద్వాంసుడై ప్రజారంజకుడై పరిపాలనము చేసిన హాలశాతవాహనునితో ముడివెట్టబడినది. అతడాకాలపువాడనుట సత్యము. కాబట్టి హాలశాతవాహనునితో శాలివాహనశకము ప్రారంభమైనదని మనము విశ్వసింపవచ్చును. కొదువవిషయములతో మనకు నిమిత్తములేదు. కాని శాలివాహనవంశజుడగుట చేత నీ హాలశాతవాహనుని శాలివాహను డవవచ్చును గాని యితడు మాత్రము మొదటిశాలివాహనుడు గాడని జ్ఞప్తియందుంచుకొనవలయును.

అమరావతీ స్తూపము బయల్పడుట.

హిందూ ద్వీపకల్పము యొక్క పశ్చిమభాగమున నున్న సాంచి స్తూపము వలె గాక(The Tope at Sanchi) అమరావతీస్తూపము సంపూర్ణముగా

  1. Early History of the Deckhan. pp. 29-30