ఆ కాలమునందు గోతమిపుత్రుడు ప్రాముఖ్యుడని డాక్టరు ఫర్యూసన్ గారు తలంచినవారయినను వారి కాలనిర్ణయపద్ధతిని బట్టి గోతమిపుత్రుడు నాలుగవ శతాబ్దాములోనికి బోవలసివచ్చినది. అయినను తరువాత వారు శకనులను జయించుటకును శకమునకును సంబంధమేమియు లేదనియు, శకరాజగు కనిష్కుని పట్టాభిషేకముతో బ్రారంభమైనదని చెప్పుచు విక్రమార్కశకము నంతకుబూర్వమునగాక నవీనకాలమునకు దెచ్చిపెట్టిరి.[1] [2] డాక్టరు ఓల్డెన్ బర్గు గారికి కడపటి యభిప్రాయము ఫర్యూసన్ గారి యభిప్రాయమునకు సరిపోవుచున్నది. సి. కన్నిహ్యామ్ గారు ఫర్యూసను గారి యభిప్రాయముతో [3]
[4]నేకీభవించుచు ఘూర్జర క్షాత్రవులు శకనులయిన పక్షముననేగాని లేనియడల శకనులకును శాలివాహనశకమునకు సంబంధమేమియులేదని నుడువుచున్నారు.[5] కన్యాకుబ్జరాజగు శ్రీహర్షుడు విక్రమార్కశకమును రూపుమాసి తనశకమును స్థాపించెనని చెప్పదురు గాని యది విశ్వసింపదగినది కాదు. ఇంతకును క్రీ.శ.811 వ సంవత్సరమునకు బూర్వము విక్రమార్కశకసంవత్సరము తేదియు నేనియు దృష్టాంతమునకై శాసనములయందు గానరావు.[6] ద్రావిడ సాంప్రదాయములు ప్రతిష్టానపురాధీశ్వరుడయిన శాలివాహనునితోనే జనించినదని సూచించుచున్న వని చెప్పెడు కర్నల్ మెకంజీ గారి యభిప్రాయముతో కర్నల్ విల్ఫర్డుగారేకీభవించుచున్నారు. [7] మరికొందరాతడింక శ్రామణుడనియు, అతడు జైనుడు గాని బౌధ్దుడు గానియై యుండవచ్చుననియు, ఆతడు తనదేశశత్రువుల నెదుర్కొనుటకై గోదావరి నుండి యుత్తరమునకుబోయి యుండెననియు వర్ణించుచున్నారు.[8] జైనగ్రంథకర్త లాలి డొక మహావిద్వాంసుడనియు, గ్రంథకర్త