పుట:Andhrula Charitramu Part-1.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము.

శాలివాహనశకము.

అనేకశకములు మనదేశములో వాడబడుచున్నవి. వింధ్యకు నుత్తరభాగమున విక్రమార్కశకమును దక్షిణ భాగమున (దక్షిణాపథమున) శాలివాహన శకమును వాడబడుచున్నవి. ఈ శకముల కీ పేరు లెట్లుగలిగెనని శంక పుట్టిపండితులు విశేషముగా జర్చించిరి. విక్రమార్కుని శకము క్రీ.పూ 57వ సంవత్సరముతో ప్రారంభమైనది గాని విక్రమార్కుడా కాలమున లేడు. శాలివాహనశకము క్రీ.త 78 వ సంవత్సరముతో బ్రారంభమైనిది గాని మొదటి శాలివాహనుడా కాలమున లేడు. అందుచేత నీ శకములకు వీరిపేరులెట్లు ముడి పెట్టబడినవని సంశయము కలుగుచున్నది. అనేక హిందూరాజులుతమతమ శకములను స్థాపించిరి కాని యవియన్నియును నంతరించినవి. గుప్తశకము, వల్లభిశకము, శ్రీహర్షశకము మొదలగునవి యన్నియు నంతరించి పోయినవి. ఒక కవి యారుశకముల నొక చాటు ధార పద్యములో బేర్కొనియున్నాడు.[1] మొదటిది యుధిష్టరశకము. ఇది యిప్పుడు వాడుకలో లేదు. రెండవది విక్రమార్కశకము వింధ్యకు నుత్తరమునను మూడవది శాలివాహనశకము వింధ్యకు దక్షిణమునను వ్యవహారములోనున్నవి యిదివరకె దెలిసియుంటిమి. ఉజ్జయినీ పురాధీశ్వరుండయిన విక్రమాదిత్యుడు క్రీ.పూ 57వ సంవత్సరమున శకనులు (Indo scythians) నోడించి శకారియని బిరుదము వహించి క్రీస్తుశకము 78వ సంవత్సరమున శాలివాహనునితో యుద్ధము చేసి హతుడయ్యెననియు జెప్పుదురు. ఇది చాలా విరుద్ధమైన షయము. ఇట్టి విరుద్ధవిషయమును గూర్చి పండితులు చర్చించుట వింత విషయముకాదు. డాక్టరు భావుదాజీ గారుజనరల్ కన్నిహ్యామ్ గారితో నేకీభవించి శాలివాహనశకము గోతమిపుత్రునికి ముడిపెట్టిరి.[2] గాని తుదకు జష్టిన్ న్యూటన్ గారితో నేకీభవించి నహపానునకు ముడివెట్టిరి.[3]

  1. j. R A. S. B, vol viiip. 118
  2. Ibid vol viii p
  3. Ibid p. 233 (3)