నాచార్యులు బౌద్ధభిక్షువులను సన్న్యాసులను దానిలో నివసించుటకు రప్పించి వారి యుపయోగార్థము ధర్మశాస్త్ర గ్రంథములన్నిటిని వ్యాఖ్యానములతో సహా దెప్పించి యొక మహాభాండారము నేర్పాటుచేసెనని చెప్పుదురు. అతడు (నాగార్జునుడు) ద్యాపలగిరి (Dyapalagiri) అనగా శ్రీపర్వతమునందు నిర్వాణముజెందెనని త్రివిష్టపదేశ గ్రంథములు (Tibetan Works)చెప్పుచున్నవి. శ్రీపర్వతము తప్పక యీ శ్రీశైలపర్వతమునకే యన్వయించుచున్నది. అచ్చటి బ్రాహ్మణులకును బౌద్ధులకును గలహములు జనించి కొంతకాలమునకు బ్రాహ్మణులను వెడలగొట్టించి యా బౌద్ధవిహారమును స్వాధీనముజేసికొనిరని గూడ హౌనుత్సాంగు చెప్పియున్నాడు. ఫర్గ్యూసను గారూహించినట్లు కోసలమునకు వైరగడా రాజధానియై హౌనుత్సాంగు చెప్పిన యరువది మైళ్ళ దూరము (30oli) రాజధానినుండియె కొలిచినయెడల నీ మఠముయొక్క ప్రదేశము చాందాకు నాగ్నేయమూలను మాణిక్యదుర్గమునకును, వరదా నదికిని సమీపస్థలమై యుండవలయును. ఫర్గ్యూసనుగారు "భాండక్" అను పట్టణసమీపమునందలి "వింధ్యసాని" పర్వతమే హౌనుత్సాంగు చెప్పిన పర్వతమని చెప్పుచున్నారుగాని యీ పర్వతము ప్రాచీనగుహలను గొన్నిటిని గలిగియున్నను అతడు వర్ణించిన వర్ణనకు సరిపోవుచుండలేదు. కాని శ్రీపర్వతమనునది కృష్ణానదికానుకొని పైని వ్రేలాడుచుండి మల్లికార్జునుడను శివునియాలయముగలిగి ప్రసిద్ధికెక్కిన బ్రాహ్మణ యాత్రాస్థలములలో నొక్కటిగ నుండిన యెత్తైన కొండయెగాని మఱియొకటికాదు. ఈ శ్రీపర్వతమే శ్రీశైలమను మఱియొక పర్యాయపదముతో వాడుకొనబడుచున్నది. శ్రీశైలము ద్వాదశ శివలింగక్షేత్రములలో సుప్రసిద్ధమైనది. ఇది ధాన్యకటకమునకు (ధరణికోట) 102మైళ్ళ దూరమునను, (W.S.W.)కందనోలుకు(Kurnool)82మైళ్ళ దూరమునను(E.N.E)నున్నది. ఇది మాణిక్యదుర్గమునకు దక్షిణముగా 250 మైళ్ళ దూరమునననగా కోసలదేశమునకు బహుదూరమున నున్నమాట వాస్తవమేయైనను హౌనుత్సాంగు స్వయముగా జూడక యితరులు చెప్పిన మాటలనుబట్టి వ్రాసినదిగావున స్థాననిర్ణయమునుజేసి
పుట:Andhrula Charitramu Part-1.pdf/191
Appearance