పుట:Andhrula Charitramu Part-1.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు నాగ్నేయమూల నరువది మైళ్ళ దూరమున పో -లో-మో-లో-కీ-లీ. (Po-lo-mo-lo-ki-li)పర్వతము మీద బూర్వకాలమున బౌద్ధమతాచార్యుడగు నాగార్జునాచార్యుని కొఱకు సో,తో, ఫో, హో (So-to-pho-ho) అను రాజు బౌద్ధసంఘారామము నొకదాని నిర్మించెనని చెప్పియుండెను. ఏకాంత ప్రదేశమున నుండిన యీ పర్వత శిఖరము తక్కిన వానికంటె మిక్కిలి యున్నతమైనదిగను, నడుమ నడుమ గనుమ లేవియును లేక యొక్కటే ఱాయితో గూడుకొని మిక్కిలి యేటవాలుగ నుండు గట్లను గలిగియున్నది. ఏ వింత వృత్తాంతము దెలియవచ్చినను తాను స్వయముగా బోయి చూడకయె సులభముగా విశ్వసించునట్టివాడగుటచేత నీ యాత్రికుడు చెప్పినమాటలను బట్టి వ్రాసినదానియందతిశయోక్తి మెండుగా గన్పట్టక మానదు. రాజు పెద్ద ఱాతి బండ నడుమనుండి సొరంగమును త్రవ్వించి త్రోవగల్పించెననియు, దాని క్రిందనుండి మేము చూచినపుడు నిట్రముగానుండి యెత్తైన యా కొండ పొడవునను సొరంగములను జూచితిమనియు, క్రింది నడుచుట కనుకూలముగ గుహలతో గూడిన వసారాలును పైన గోపురములను గలిగి, యైదంతస్తుల కట్టడము గలదనియు, ఒక్కొక్క యంతస్తులో విహారములతో జుట్టుకొనబడిన నాలుగేసి పడసాలలు (చావళ్ళు) గలవనియు జెప్పుచున్నాడు. మఱియును పేరు నల్లని శిఖరమని దెలుపుచున్నదని కూడ తెలియజేయుచున్నాడు. అయిదవ శతాబ్దారంబమునందుండిన ఫాహియాన్ అను చీనా దేశస్థుడయిన యాత్రికుడు కాశీ నగరము నందుండినపుడీ ప్రదేశమునుగూర్చి విని యింతకంటెను వింతయైన వృత్తాంతమును దెలుపుచున్నాడు. అతడు దానిని పో-లో-యు (po-lo-yu) అని పిలుచుచు పారావతమఠమని యర్థము చెప్పుచున్నాడు. హౌనుత్సాంగు వాడిన "పో-లో-మో-లో-కి-లి" అను పేరు జూలియన్ చెప్పిన ప్రకారము పరమాలగిరి లేక పరబరాగిరియని గాని బీల్ చెప్పిన ప్రకారము బ్రహ్మరాగిరియని గాని యర్థమగును గాని యివి యేవియును చీనా యాత్రికులిరువురు చెప్పెడి వర్ణక్రమములతో పారావతమని స్థల నిర్దేశము చేయుటకు దోడ్పడజాలకున్నవి. పారావతమను పేరే నిజమైనదేమో? ఈ పారావతమఠమునకే నాగార్జు