పుట:Andhrula Charitramu Part-1.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలనము చేసినట్లు గానవచ్చుచున్నది. వీని కాలమున మాళవదేశము తన స్వాతంత్ర్యమును బ్రకటించినటుల గానంబడుచున్నది. ఉజ్జయినీ క్షాత్రపులదగు అవంతిదేశమాంధ్రరాజుల పాలనము నందుండిన కాలమున రుద్రదాముడను వాడు తన పూర్వులు గోల్పోయిన రాజ్యమును మరల స్వాధీనము చేసికొనెనని విని గోతమిపుత్త్ర యజ్ఞశ్రీశాతకర్ణి వాని పైకి దండెత్తి పోయి రెండు పర్యాయములు యుద్ధము చేసియు విజయము పొందలేక స్వరాజ్యమునకు మరలిపోవలసి వచ్చెను. ఇందునుగూర్చియె రుద్రదాముడు జనగడ శాసనములో దక్షిణా పథపతియైన శాతకర్ణిని రెండుమాఱు లోడించితిననియు, దూరముచేతను, బంధుత్వముచేతను వాని దేశములోనికి దఱుముకొని పోవక నాశము చేయక విడిచిపెట్టవలసిన వాడనైతినని చెప్పుకొనియెను. ఈ బంధుత్వము కూతురు బిడ్డయగుటచేతనే యని తోచుచున్నది. రుద్రదాముని కాలము నిర్ణయించునపుడు పాశ్చాత్యపండితులు భిన్నాభిప్రాయులై యెవరికి దోచిన రీతిని వారు చెప్పియుండిరి. కాబట్టి శాతకర్ణికిని రుద్రదామునకును జరిగిన యుద్ధముల కాలమును దెలిసికొనుట మిక్కిలి కష్టసాధ్యముగనున్నది. క్రీ.పూ.89వ సంవత్సరమున జరిగియుండునని లాసన్ గారు చెప్పుచున్నారు. [1] అది యిదియని నిశ్చయపఱచలేక సంకోచముతో ప్రిన్సెప్ గారు క్రీ.పూ.189వ సంవత్సరమయి యుండునని యూహించుచున్నారు. డాక్టరు భావుదాజీ గారు క్రీ.శ. 200లని భావించుచున్నారు. [2] క్షాత్రపరాజుల నాణెములను గూర్చి వ్రాయుచు న్యూటనుగారు రుద్రదాముని క్రీ.శ.40-45 సంవత్సరములలో నిలిపినారు. [3] ఈ కాలమును రివరెండు థామస్సనువారామోదించుచున్నారు.[4] ఈ శాసనమును ప్రిన్సెప్, విల్సన్, ఎజిలింగ్, భగవన్ లాల్ ఇంద్రాజి, డాక్టరు బూలరు మొదలగువారనేకులు భాషాంతరీకరించి, ప్రకటించియున్నారు. [5] రుద్రదాముడు 72వ సంవ

  1. Muir Sanskrit Texts Vol.ii., p.142, 1st ed.,
  2. Jour, Bom, Branch, Roy, As, Soc. Vol.vii., pp.117-120
  3. Ibid. Vol.ix., p.17.
  4. J.R.A.S.Vol.xiii., N.S.P. 524
  5. Prinsep Translation. J.A.S.B. Vol.viii., pp.334- 348; Prof. H.H. Wilson's. Prinsep's Essays, Vol.ii ., pp. 57-67 Prof.Eggeling. Burgess second Report p. 129. Bhagavaa Lai Indraji & Dr. Buhler. Ind. Ant. Vol Viii.pp. 257-263.