ల్హాపురమునందు వాసిష్టీపుత్ర విలివాయకురుడు రాజప్రతినిధిగనుండెను, వీనిపేరిటి నాణెములు కోల్హాపురమునందు గాన్పించినవి.
ఇత డే కాలమునందుండినవాడో నిశ్చయముగా దెలియరాదు. ఇతడు గోతమిపుత్త్రశాతకర్ణి యొక్క పుత్రులలో నొకడై యుండవచ్చును. ఇతడు గోతమిపుత్త్రశాతకర్ణి యొక్క పుత్రులలో నొకడై యుండవచ్చును. ఇతడు మాధారిపుత్రశకసేనుని కొడుకనియు క్రీ.శ.185 దవ సంవత్సరప్రాంతమున దక్షిణమహారాష్ట్ర దేశమును బరిపాలించుచుండెనని డాక్టరు భాండార్కరు గారు వ్రాయుచున్నారు. [1] ఈతడే మొదటి విలినాయకురు డనియు, ఈతడాఱుమాసములు మాత్రమే రాజ్యము చేసెననియు క్రీ.శ. 84 5 సంవత్సర ప్రాంతమున నుండెననియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాయుచున్నారు. [2] ఇతడు రుద్రదాముని యల్లుడనియు, గోతమిపుత్త్రయజ్ఞశ్రీశాతకర్ణియొక్క తండ్రియనియు డాక్టరు బూలరుగారు వ్రాయుచున్నారు.[3] నానాఘట్టముబాటమీదను ఈ నడుమ నూతనముగా గనిపెట్టబడిన నీటితొట్టిమీద నొకశాసనము గన్పట్టెను. దానిపైన "చతరపానశాతకానివాసతి" వాసిష్ఠీపుత్త్రచతుష్పర్ణశాతకర్ణియనుపేరు యజ్ఞశ్రీశాతకర్ణునిపేరును నుదాహరింపబడియున్నవి. ఇతడు ధాన్యకటకము నందుండి యాంధ్రరాజ్యమునంతయు బరిపాలించినవాడో లేక మఱియే భాగమునకైన రాజప్రతినిధిగనుండి పరిపాలించినవాడో స్పష్టముగా దెలియరాదు.