వాడనియు, అకరావంతి, అపరాంత, అనూప, సురాష్ట్ర మొదలగు దేశములను జయించిన వాడనియు, దక్షిణాపథ రాజగు శాతకర్ణిని రెండుమాఱులు జయించిన వాడయినను సమీప బంధుత్వము కలిగి [1] యుండుటచేతవానిని నాశముచేయలేదనియు మొదలుగాగల సంగతులెన్నియో చెప్పబడినవి. ఈ రుద్రదామునికొడుకు రుద్రసింహుడనువాడు. ఈ రుద్రసింహునికొడుకు రుద్రసేనుడనువాడు. వీని శాసనమొకటి "జాస్ దన్, అను ప్రదేశమున గానంబడుచున్నది. శకకాలము 127వ సంవత్సరము భాద్రపద బహుళ సప్తమినాడు మహాక్షాత్రప చస్తన మహారాజుయొక్క మనుమని మనుమడును, క్షాత్రపస్వామి జయదామ మహారాజుయొక్క కుమారుని మనుమడును, మహాక్షాత్రప రుద్రదామ మహారాజుయొక్క మనమడును, మహాక్షాత్రప భద్రముఖస్వామి రుద్రమహారాజుయొక్క కుమారుడునగు మహాక్షాత్రప భద్రముఖస్వామి రుద్రసేన మహారాజుయొక్క యీ చెఱువు" మొదలుగాగల విషయములు గలవు. [2]
సాల్సెట్టి దీపములోని కన్హేరిస్తూపములోని 11వ శాసనమున చెలమనుగూర్చిన దానము గూర్చి భగవన్ లాల్ ఇంద్రాజీ పండితుడు "మహాక్షాత్రపుడయిన రుద్ర ×+× యొక్క కూతురును, కర్దమక రాజవంశమునందు జనించి వాసిష్టీపుత్ర శాతకర్ణి యొక్క రాణియునగు ×+× యొక్క" అని శాసనములోని కొన్ని పంక్తులను చదువుచున్నాడు. దీనింబట్టి డాక్టరు బూలరుగారు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి యొక యాంధ్రరాజనియు, వాని రాణి క్షాత్రపుని కూతురనియు, కన్హేరి శాసనములోనుండిన వాసిష్ఠీపుత్ర శాతకర్ణియు, చతురపాన (చతుష్పర్ణ)