పుట:Andhrula Charitramu Part-1.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చస్తనవంశము.

గోతమిపుత్ర శాతకర్ణుని కాలమునను అతని కుమారుడగు శ్రీపులమాయి కాలమునను ఉజ్జయినీ పురము రాజధానిగా మాళవదేశమును చస్తనుడను ఓఆత్రపుడు పరిపాలించుచుండెనని శాసనములచేతను, నాణెముల చేతను, టాలెమీయను చరిత్రకారుని వ్రాతేతను ధ్రువపడుచున్నది. చస్తనుడు స్మిత్తుగారు భావించినట్లు క్షహరాట వహపానుడను క్షాత్రపుని వంశములోని వాడుగాడు; గోతమిపుత్త్ర శాతకర్ణుడు నహపానునుండి గెల్చిన రాజ్యమునకు రాజప్రతినిధిగ జేయబడినవాడునుగాదు. ఉజ్జయినినేలు స్వతంత్రుడయిన మఱియొక క్షాత్రపరాజు. వీని కుమారుడు జయదాముడు. ఇతడే ప్రతిష్ఠానముపై దండెత్తి శ్రీపులమాయి శాలివాహనునితో యుద్ధముచేసి యోడిపోయినవాడు. వీనికొడుకు రుద్రదాముడను వాడు. వీని శాసనమొకటి జనగడలో గాన్పించుచున్నది. శక కాలము 72వ సంవత్సరమున మార్గశీర్ష బహుళ చతుర్థి నాడు సుదర్శన సరస్సుయొక్క గట్టు తెగిపోవుట మొదలగు విషయములనేకములీశాసనమునగలవు. ఈ గట్టు చంద్రగుప్త చక్రవర్తి మౌర్యుని కాలమున పుష్పగుప్తునిచేతను, అశోకవర్ధన చక్రవర్తి మౌర్యుని కాలమున తుషాష్పుడను యవనరాజు చేతను బాగుచేయించబడినదని కూడ పై శాసనమున జెప్పబడియెను. [1] "సర్వర్ణైరభిగమ్య రక్షణార్థంపతి త్వేవృతేహ" అని చెప్పియుండుటచేత మాళవదేశమునందలి సర్వవర్ణముల వారును రుద్రదాముని కడకుబోయి తమ సంరక్షణకొఱకు నాతని రాజుగ జేసిరనియు, "భ్రష్టరాజ్య ప్రతిష్ఠాపకేన" యని చెప్పియుండుటచేత భ్రష్ట (పోయిన) రాజ్యమును ప్రతిష్ఠాపించినవాడనియు, [2] మహాక్షాత్రప బిరుదమును వహించిన

  1. Arch Rep 1874-75, p.129. Indian Antiquary, 1878 (Vol.vii) p.26, p.261, 269.
  2. "భ్రష్టరాజ ప్రతిష్ఠాపకేన"యని భగవన్ లాలను పండితుడు 'ఇండియన్ అంటిక్వేరి' యను గ్రంథము 7వ సంపుటమున వ్రాసియున్నాడు గాని ఆ దిగువను జేర్చిన వ్యాఖ్యానములో రాజయనుదానిని రాజ్యయని చదువుట సరియైన పాఠమని డాక్టరు బూలరుగారు చెప్పిరి.