Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలు పారితోషికముగ నొసంగి తమకుంగల భాషాభిమానముంజూపినందుకు వారికెంతయు నా కృతజ్ఞతానందనముల నిందుమూలమున దెలుపుకొనుచున్నాను. మరియును శ్రీరాజాగారి ప్రయివేటు సెక్రటరీగారగు బ్రహ్మశ్రీ మొక్కపాటి సుబ్బరాయుడు పంతులు బి.ఏ. గారు చూపిన యభిమానమునకుగూడ నా కృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాడను.

మరియును దేశభాషాభిమానులయిన మిత్రులనేకులు తోడ్పడి నాకు విశేషధనసహాయమును జేసిరి. అందుముఖ్యముగా తెలుగు జనానాపత్రికాధిపతులు గుంటూరు కాలేజీలో ప్రథమసహాయోపోధ్యాయులునునైన నా చిరకాలమిత్రులగు బ్రహ్మశ్రీ రాయసము వేంకటశివుడు పంతులు బి.ఏ.ఎల్.టి. గారు నాకష్టసుఖముల మొదటినుండియు నెరింగినవారుగావున సర్వవిధములచేతను నాకు ప్రోత్సాహమును కలిగించుచువచ్చుటయేగాక నే నెన్నడును మరువంగూడని సాహాయ్యమును జేసిరని చెప్పిన జాలును. వీరును గుంటూరువాసులును హైకోర్టువకీలు నగు బ్రహ్మశ్రీ కొండా వేంకటప్పయ్యపంతులు బి.ఏ.బి.ఎల్ గారును. ప్లీడరు బ్రహ్మశ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారును గలిసి చెన్నపురిలో నా కగువ్యయమునకుగా నూటయేబది రూపాయలొసంగి సాహాయ్యము చేసినందుకు నా కృతజ్ఞతానందనములను దెలుపుకొనుచున్నాను.

అందరికంటెను ముఖ్యముగా గంటికి రెప్పవలెదగ్గిర నుండి నిరుత్సాహపడుచుండినప్పుడు ధైర్యమునుచెప్పుచు సర్వవిధములదోడ్పడి మరువంగూడని సాహాయ్యమొనర్చి నాచే నీకార్యము నిర్వహింపజేసిన బ్రహ్మశ్రీ కొమర్రాజు వేంకట