పుట:Andhrula Charitramu Part-1.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలి ప్రతిష్ఠాన పురమునుండ నియమించి తన పూర్వులు గోల్పోయిన దేశములను మరల స్వాధీనము జేసికొనుట వీరపురుషోచిత ధర్మమని భావించి క్షాత్రపులపై దండెత్తుటకు సన్నద్ధుడయ్యెను. వీని పరాక్రమమునకు వెఱచి యవనశకపహ్లవాదులనేకులు వశులై రాజభక్తిని జూపుచు మ్లేచ్ఛత్వమును విడిచిపెట్టి జైనబౌద్ధమతముల నవలంబించి సర్వవిధముల నాతనికే దోడ్పడుచుండిరి. గోతమిపుత్రుడు తనకు బ్రతిఘటించి నిలిచిన యవనశకపహ్లవాదులను దఱుముచు శాత్రవులదేశముపై దాడివెడలి యనేక దినములు వారలతో ఘోరయుద్ధములు సేయుచు విజయమును గాంచుచుండెను. ఈ యుద్ధములయందు దండ్రికి యువరాజుగానుండిన పులమాయి కూడ నుండి తోడ్పడుచుండెను. ఇట్లు యుగాంతకాలరుద్రుడై గన్నులకు దేఱిచూడరాకయుండిన యీ మహాశూరవరాగ్రగణ్యుని బాఱింబడి జావలేక యా మ్లేచ్ఛులనేకులు యుద్ధములు మానుకొని శరణుజొచ్చిరి. సౌరాష్ట్రమునకు దండెత్తి పోయి సహపానుని వంశమును నిర్మూలము గావించెను. ఈ దండయాత్రను గూర్చి చరిత్రము శాసనములవలన ధ్రువపడుచున్నది.

గోతమిపుత్రుని శాసనములు.

నాసికపట్టణములోని కొండయొక్క కట్టకడనున్న గుహాలయమునందలి నాలుగుశాసనములలో బొడవయిన దానిలో నీక్రింది వృత్తాంతములు గన్పట్టుచున్నవి. వాసిష్ఠపుత్రుడయిన పులమాయి రాజుయొక్క పందొమ్మిదల పరిపాలన సంవత్సరమున గోతమిపుత్ర శాతకర్ణియొక్క తల్లి గోతమి ప్రేరేపణమున నీ గుహాలయము నిర్మింపబడి భద్రాయనీయ శాఖలోని బౌద్ధభిక్షవులకు నర్పణచేయబడియెను. ఈ శాసనమునందు గోతమి మహారాజుయొక్క తల్లియనియు, మహారాజుయొక్క ముత్తవతల్లి (నాయనమ్మ) యనియుంగూడ పేర్కొనంబడియెను. గోతమిపుత్ర శాతకర్ణి రాజాధిరాజనియు, ఆస్మిక, అసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప విదర్భ, అకరావంతి దేశములకు బాలకుడనియు బేఱ్కొనపడియెను. అతడు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము మొదలగు పర్వతముల కధినాథుడుగనుండెను; అతనియాజ్ఞలను రాజన్యవరులనేకులు విధేయులై శిర