పుట:Andhrula Charitramu Part-1.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గానంగీకరించి పూజించుచుండుటచేతను అట్లుబుద్ధదేవుని పూజింపకుండుట చేతను శైవులు సాధారణముగా బ్రాహ్మణ పక్షపాతులై యుండుచువచ్చిరి. ఆంధ్ర రాజధానీ నగరమగు ధాన్యకటకమునకు దక్షిణభాగమున జైనబౌద్ధశైవమతములవలంబించిన పహ్లవాదులు వేనవేలు నివసించుచు గ్రమముగా నాంధ్రులలోగలసిపోయి యాంధ్రపహ్లవు లనంబడుచుండిరి. ఈ యాంధ్రపహ్లవులే పల్లవులైరి. ఈపల్లవులు నివసించుప్రదేశమే పల్లవనాడను పేరంబిలునంబడు చుండెను. ఈ పల్లవనాడే నేడు పల్నాడని పిలువంబడుచు గుంటూరుమండలములో నున్నది.

---