పుట:Andhrula Charitramu Part-1.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తడు ఐత్సగోత్రుడని చెప్పుటచేత బ్రాహ్మణుడుగ బరిగణింపబడెనని భాండార్కురుగారు వ్రాసియున్నారు.

కాలనిర్ణయము.

ఋషభదత్తుని శాసనములలో గొన్న 40, 41, 42 సంవత్సములలో వ్రాయబడినవనియు, సహపానుని మంత్రియగు ఆయమునియొక్క శాసనము 46వ సంవత్సరమున వ్రాయబడినదనియు, చెప్పియుండుటచేత నీ సంవత్సరములు శకనృపకాలమునకు సంబంధించినవిగ గన్పట్టుచున్నవి గనుక క్రీ.శ.124వ సంవత్సర ప్రాంతమున క్షహరాటాసహపానా యను మహాక్షాత్రవుడు మహారాష్ట్ర దేశమును బాలించుచుండెనని చెప్పవచ్చును.

శివస్వాతికర్ణుడు.

(క్రీ.శ.109 మొదలుకొని క్రీ.శ.130 వఱకు.)

పశ్చిమాంధ్రదేశమున (మహారాష్ట్రమును) పైజెప్పిన సహపానుడు రాజ్యము చేయుచున్న కాలమునందు శివస్వాతియను శాతవాహనుడు పూర్వాంధ్రదేశమును బరిపాలించుచుండెనని స్పష్టముగ జెప్పవచ్చును. బహు శతాబ్దములనుండి యాంధ్రరాజుల సంరక్షణము క్రిందనుండి పరరాజుల వలన గాని పరదేశీయుల వలనగాని బాధింపబడక కష్టములెట్టివో యెఱుంగకయుండిన యాంధ్రులనడుమ వేషభాషమతాదులచే వేఱుపడి భరతఖండముయొక్క తీక్ష్ణతరమైన యుష్ణస్థితికి దూరగులై దేహదార్ఢ్యమును బాహుబల సంపన్నతయు, పౌరుషమునుగల జాతులవారగు యవశకపహ్లవాదులు మిడతల దండులవలె తండోపతండములుగా వచ్చి నివసించియుండుటచేత గొంతకాలము దేశమున కలవరము గలిగియున్నప్పుడు శివస్వాతి తన భుజపరాక్రమముచేత మ్లేచ్ఛజాతులవలన స్వదేశస్థులకు నే యుపద్రవమును గలుగకుండ గాపాడి రాజ్యపాలనము చేసినది శ్లాఘాపాత్రముగా నుండెనుగాని తనకు బూర్వమునందుండిన మాండలకుడు మొదలగు రాజులు పశ్చిమాంధ్రదేశమును క్షాత్రవులకు గోల్పోవుటచే శాతవాహన వంశమునకు గలిగిన యపకీర్తిని బాపుకొనలేక