Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగార్థమై గుహావిహారమును (Cave monastery) వారలకు సమర్పించెను; సంవత్సరమునకు నూరు కర్షపణములు వడ్డిరాగల రెండువేల కర్షపణములను గోవర్ధనములోని నేతగాండ్ర కూటమికడ నుంచెను; వర్షకాలములో తాను నిర్మించిన విహారములో నివసించెడు నిరువది బౌద్ధమతాచార్యులకొక్కొక్కనికి నొక్క దుప్పటమును వడ్డి సొమ్ములోనుండి కొనియీయవలసినదిగా నాజ్ఞచేసెను; ఈ సొమ్ములోనుండియే యితర వస్తువులనుగూడ వారలకు గొని యీయవలయును; ఈ యాజ్ఞలు గోవర్ధనములోని పౌరసభవారిచే (Corporation) తీరుమానింపబడి విహారముయొక్క తలుపుమీద లిఖింపబడినవి; శకనృపకాలము 40, 41 సంవత్సరములలో విశేషధనమును బ్రాహ్మణులకును దేవతలకును దానముచేసెను" [1] మూడవ శాసనములో ఋషభదత్తుని భార్య దక్షమిత్రయొక్క ధర్మకార్యమొకటి యుదాహరింపబడినది గాని యా శాసనము మిక్కిలి చిన్నది. [2] నాలుగవ శాసనము చాలవఱకు శిధిలమైపోయినదిగాని యదియును ఋషభదత్తుని ధర్మకార్యములను ప్రశంసించుచున్నది. [3]

బొంబాయి రాజధానిలో కార్లి గుహలో నొక బౌద్ధాలయముగలదు; అందొక శాసనముగలదు; వానిలో వాలురాకాపర్వత విహారములోని బౌద్ధభిక్షువుల పోషణార్థము కొఱకు కార్జిక గ్రామమును వారలకు దానము చేసినట్లుగ వ్రాయబడియున్నది.[4] నాసిక శాసములలోని మొదటిదానిలో బేర్కొనబడిన ధర్మకార్యములవంటివాని వృత్తాంతము గూడ వ్రాయబడియున్నది. [5] జున్నారులోని యొక శాసనములో మహాక్షాత్రపుడు క్షహరాటాసహపానాయొక్క బ్రాహ్మణమంత్రియగు "ఆయమ" యనువాడు చెఱువునొకదాని త్రవ్వించుటకును సభాభవన మొకదాని నిర్మించుటకును ప్రేరకుడయ్యెనని వ్రాయబడియున్నది. ఈ

  1. Nos 18 and 16. Nasic Inscription; Ibid.
  2. 1st part of No.16, Ibid;
  3. No.14, Ibid.
  4. No.13, Karli Inscriptions Arch snrv w, Ind No.10
  5. No.25 Junnar inscriptions, Ibid.