పుట:Andhrula Charitramu Part-1.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యాత్రికుల కనుకూలముగ నుండునట్లు వారణాన్యనదికి మెట్లవరుసను (సోపానములను) గట్టించెను; దేవాలయులకు బ్రాహ్మణులకు పదునాఱుగ్రామములు దానముచేసెను; ప్రతి సంవత్సరము లక్ష బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను; ప్రభాసపట్టణమున (సోమనాథపట్టణము) బ్రాహ్మణు లెనమండుగురకు తన సొంతసొమ్ము వెచ్చఁబెట్టి వివాహములను గావించెను; భరుకచ్చము (Bharoch) నందు చతురస్రములను, గృహములను, విశ్రాంతిప్రదేశములను నిర్మించెను; మాళవములోని దశపురమునందును, గోవర్థనము నందును, శూర్పరాగమునందును (The modern supara near Bassein) ఆరామముల నిర్మించి బావులను చెఱువులను త్రవ్వించెను; ఠాణా సూరతులకు నడుమనుండు ఇవా, పారదా, దమనా, తాపీ, కరవేణా, దాహనుకానదులలో రేవుపడవలను బెట్టించెను. ఈ నదుల కిరుప్రక్కలను బాటసారులకొఱకు విశ్రాంతి గృహములను చలివేంద్రలను (పానీయశాలలు) గట్టించెను; నామంగోల గ్రామములోని పిండితకావాడ, గోవర్ధనము, సువర్ణముఖము, శూర్పరాగము రామతీర్థములలోను చారణులకొఱకును , పరిషత్తుల కొఱకును (Vedic schools of Brahmans) కొన్ని ధర్మకార్యము లాచరించెను; మలయలచే ముట్టడింపబడి చెఱబెట్టబడిన యుత్తమభద్రులను క్షత్రియజాతి నాయకుని విడిపించుటకై తన ప్రభువు నాజ్ఞప్తిని శిరసావహించి యొక సంవత్సరమున వర్షకాలములో దండయాత్ర వెడలెను; ఋషభదత్తుని రణభేరీధ్వని వినంబడినతోడనే మలయలు వెన్నిచ్చి పారిపోయిరి. ఉత్తమభద్రులకు మలయలు వశులగునట్లు చేసెను; అక్కడనుండి ఋషభదత్తుడు పుష్కరిణికిబోయి స్నానాదికృత్యములు గావించి బ్రాహ్మణులకు మూడువేల గోవులను నొక గ్రామమును దానముచేసెను.”

ఈ పై శాసనమునుబట్టి యీ ఋషభదత్తుడు బ్రాహ్మణ మతాభిమానమును, బ్రాహ్మణ భక్తియు గలవాడని తేటపడుచున్నను బౌద్ధ మతమును గాని, బౌద్ధులనుగాని తిరస్కరించి యుండలేదు. రెండవ శాసనములో బౌద్ధభిక్షువులకు జేసిన ధర్మకార్యములుదాహరింపబడినవి. ఋషభదత్తుడు శకనృపకాలము 42వ సంవత్సరమున నాల్గుదెసలనుండి వచ్చెడి బౌద్ధసన్న్యాసులయుప