పుట:Andhrula Charitramu Part-1.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షహరాటాసహపానా.

కనిష్కుని మరణానంతరము ఘూర్జరమును బరిపాలించుచున్న క్షహరాటానహపానుడనువాడు స్వతంత్రుడై మహాక్షాత్రపుఁడను బిరుదును వహించి యాంధ్రులను మహారాష్ట్ర దేశమునుండి పాఱఁదోలి యాభాగమునంతయు స్వాధీనము చేసికొని తన యల్లుఁడగు ఋషభదత్తుని రాజప్రతినిధిగఁజేసి నిరంకుశముగ బరిపాలింపసాగెను. ఈ రాజులు దేశమున స్థిరపడిన తరువాత నార్యహిందువులయొక్క బోధనలచే స్వమతాచార సాంప్రదాయములను విడిచిపెట్టి హిందూనామములను హిందూమతాచారములనవలంబించి బ్రాహ్మణులను మంత్రులనుగా నియమించుకొనుచువచ్చిరి. ఆర్యబ్రాహ్మణులు క్షాత్రపులను మ్లేచ్ఛరాజుల సహాయముతో బ్రాహ్మణమతమును వ్యాపింపజేయుచు బౌద్ధులకు బ్రతిస్పర్థులుగ నున్నను అప్పటికింకను బౌద్ధులును బ్రాహ్మణులును నొండొరుల బలద్విరోధులుగ నెంచుకొనక సహనముతో నుండిరి. ఆయముడను బ్రాహ్మణుడు క్షహరాటాసహపానుననకు మంత్రిగానుండెను. ఋషభదత్తుడు సేనాధ్యక్షుడుగానుండెను. దక్షమిత్రయను దనకొమార్తెను ఋషభదత్తునికిచ్చి వివాహముచేసి వానికి సైన్యాధిపత్యముపట్టముగట్టెను. నాసిక పట్టణములోని గుహలలోవ్రాయబడిన శాసనముల వలన నీ క్షాత్రపుల చారిత్రముకొంత బోధపడుచున్నది. ఒక గుహలో నాలుగు శాసనములున్నవి. వానిలో మొదటి శాసనములో గోవర్ధనములోని త్రిరాస్మి శిఖరము మీద నీ గుహయును చెఱువులును దినికుని పుత్రుడును క్షహరాటసహపానుని జామాతయు పరోపకారియునైన ఋషభదత్తుని ప్రేరేపణచే నిర్మింపబడెనని చెప్పబడినది.[1]

ఋషభదత్తుని ధర్మకార్యములు.

మఱియు ఋషభదత్తుని ధర్మకార్యములీ క్రిందివి పేర్కొనబడియుండెను. ఋషభదత్తుడు బ్రాహ్మణులకు మూడులక్షల గోదానములు చేసెను;

  1. No.17, Nasik Inscriptions Vol.VII., Jour. B.B.R.A.S. and p.338. Trans oriental Congress. 1874.