శ్రీమంతుడు నా ప్రయాసమును స్వయముగా వీక్షించు చుండిన మండలిసభాసదుడగు లక్షణరావు పంతులుగారిచే నా చేయుచున్న పనినంతయు విని దయార్ద్రహృదయుడై నాగ్రంథము యొక్క యీ ప్రథమ భాగమున కగు ముద్రాభృతి నంతయు దాము వహింతుమని తెలియజేయుటయె గాక వాగ్దత్తము ప్రకారము నెరవేర్చి నాకష్టముల నన్నిటిని తుదముట్టించి నాకు మహోపకారము చేసిరి. నిష్కామకర్మమును గుప్తదానమును చేయుటయే శ్రేష్ఠమని తలచి తమనామమును సయితము నుదహరింపవలదని యీ యుదారపురుషుడు కోరినందున, ఈ గ్రంథము తన్నామాంకితము చేసి నాకృతజ్ఞతను జూపలేకపోతిని గదా యని చింతించుచున్నాడను. రాజభక్తియు, దేశభక్తియు గలిగి వరలుచుండిన యీ శ్రీమంతుని చేతిలో నాంధ్రభాషామతల్లి యింకను వర్ధిల్లవలెనని కోరుచు వారికి నాయురారోగ్యైశ్యర్వములనిచ్చి చిరకాలము బ్రోచుగాతమని భగవంతుడని బ్రార్థించుచు వట్టిమాటలచేతనే నా కృతజ్ఞతని దెలుపుచున్నాను.
ఇట్లు విజ్ఞానచంద్రికామండలి వారి సాహాయ్యముచేతను, ప్రోత్సాహముచేతను సఫలీకృతమనోరథుండనైతిని గావున నేనెప్పుడును వారికి గృతజ్ఞడునై యుండవలసివాడనగుచున్నాడను.
కృతజ్ఞతావందనములు
నానదుద్యమును నా కష్టముల నొకనొకా మిత్రునిచే విని శ్రీ పిఠాపుర సంస్థానాధీశ్వరులయిన మ.రా.రా.శ్రీ శ్రీరాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహదరు జమిందారుగారు నా గ్రంథముయొక్క ముద్రాభృతికై నూరురూపా