వి. ఇతడు పది సంవత్సరములు మాత్రమే రాజ్యము చేసెనని వాయుపురాణమును 18 సంవత్సరములని మత్స్యపురాణమును చెప్పుచున్నవి. వీని పేరుదాహరించిన శాసనమొకటి నాసికపట్టణ సమీపమునందలి యొక చిన్న గుహలో గన్పట్టుచున్నది. శాతవాహన వంశజుడయిన కృష్ణుడను రాజుయొక్క సైన్యాధికారులలో నొకనిచే నా గుహ త్రవ్వించబడినదని యందు వ్రాయబడియుండెను. [1] కాని యితడు శాతవాహన రాజకుటుంబములో జేరిన యొక సామాన్యుడేగాని రాజుగాడనియు, ఇతనికి రాజబిరుదావళులేవియును లేవనియు, ఈ కృష్ణుడే పురాణములలో నాంధ్రభృత్య వంశములో రెండవవాడుగా బేర్కొనబడిన కృష్ణుడే యని యనేకు లభిప్రాయ పడుచున్నారుగాని కేవలము పొరబాటనియు, ఎందుకన నప్పటికి నాంధ్రులు దక్షిణాపథమునకు వచ్చియుండలేదనియు దక్షిణ హిందూదేశపు నాణెముల చరిత్రమును వ్రాసిన సర్ వాల్టరు ఎల్లియాట్ గారు వ్రాయుచున్నారు. [2] వీరివాద మెంత మాత్రమును విశ్వసింపదగినదికాదు.
క్రీస్తుకు బూర్వము మూడుశతాబ్దముల క్రిందట ద్రావిడులాంధ్రులని కాళింగులని యిరు తెగలుగానేర్పడి గంగానదీ ముఖద్వారమున నివసించుచుండి యశోకుని కాలమునందు రాజును గలిగియుండు దొరతనమునకు వశులై మౌర్యరాజుల యనంతరము సంభవించిన రాజ్యకల్లోలమును బురస్కరించుకొని మగధ రాజ్యమునాక్రమించుకొనియు శకనులను విదేశరాజులతోడ పోరుపడలేక మొదటి శతాబ్దమున నాకాలమునందలి యాచారముబట్టి యాంధ్రులును, కాళింగులును స్వకుటుంబసపరివార సమేతముగా సముద్రతీరము వెంబడిని దక్షిణమునకు వచ్చిరనియు, వారిలో కాళింగులు గోదావరి నదికి నుత్తర భాగమున నిలిచియుండిరనియు, ఆంధ్రులు "పరికాడ్ ఆంధారి" యను చిల్కసరస్సుయొక్క యొడ్డులను గొంతకాలముండి తరువాత బయలుదేఱి వచ్చి కృష్ణాతీరమున నాంధ్రరాజ్యమును స్థా