ధరాజ్యమునాక్రమించుకొని, దేశమునందలి యల్లరుల మాన్పి, రాజప్రతినిధినినొక్కని నియమించి, తన రాజధానియగు ధాన్యకటకమునకు మరలివచ్చెను. ఇందునుగూర్చి చరిత్రకారులు భిన్నాభిప్రాయములు గలిగి యుండుటచేత నీ యంశమును సహేతుకముగా సమర్ధింపకున్న పక్షమున నీ వాక్యము గొందఱకు బరిహాసపాత్రముగా దోచవచ్చును. కాణ్వాయనుడను సుశర్మను జంపి మగధరాజ్యము నాక్రమించినవాడు శ్రీశుకుడని మత్స్యపురాణమును, శ్రీప్రకుడని విష్ణుపురాణమును బ్రహ్మాండపురాణమును, సింధుకుడని వాయుపురాణమును, పేరు చెప్పక వృషలుండని మాత్రము భాగవతపురాణమును బేర్కొని శ్రీముఖుని పేరెత్తకయుండుటచేతను, ప్రాచీన హిందూదేశ చరిత్రమును వ్రాసిననవిన్సెంటు.ఎ.స్మిత్తు గారు సుశర్మను జంపినవాడు శ్రీముఖుడుగాక కుంతల శాతకర్ణి గాని, శాత శాతకర్ణిగాని, పులమాయిగానియై యుందురనియు, క్రీస్తునకుబూర్వము 27వ సంవత్సరమున కాణ్వవంశ మంతరించియుండెనని యొప్పుకొన వచ్చునని మగధరాజ్యమును బాలించిన శుంగరాజులలో గడపటివారు పేరునకు మాత్రము రాజులుగానుండి పీష్వాలచేతులలోని మహారాష్ట్ర రాజులవలె బ్రాహ్మణ మంత్రులచేతులలో బొమ్మలవలెనున్న మాట వాస్తవమేయైనను శుంగరాజులలో బదియవవాడగు దేవభూతి కాణ్వాయన బ్రాహ్మణుడగు వాసుదేవునిచే జంపబడియెనని పురాణములయందును బాణకవి విరచితమగు నార్ష చరిత్రమునందును స్పష్టముగ జెప్పబడియున్నందున శుంగవంశముతో కాణ్వవంశము సమకాలీనమని చెప్పెడి డాక్టరు భాండార్కరుగారి వాదము [1] గ్రాహ్యముకాదనియు వ్రాసియుండుటచేతను శ్రీముఖునిగూర్చి కొంచెము చర్చింపవలసియున్నది. పురాణములలోని యాంధ్రరాజుల నామములును శాసనములలోని నామములును భేదములేక సరిపోయినవగుటచేతను పురాణములలో బ్రాచీనపురాణమయిన మత్స్య పురాణము శ్రీశుకుడని చెప్పియుండుటచేతను, దేవనాగరలిపిలో శకార మకారములకు నీషణ్మాత్రమే భేదము గలిగియుండుటచేత లేఖకులు శ్రీముఖు
- ↑ Mr.V.A.Smith's Early History of India, pp.193-194.