పుట:Andhrula Charitramu Part-1.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏడవప్రకరణము.

శాతవాహనవంశము.

శ్రీముఖశాతవాహనుడు.

- - -

(క్రీ పూ. 73 మొదలుకొని 50 వఱకు)

ఏదీవి నే డాంగ్లేయనాగరికతన జన్మభూమియై భూమండలములోని యేబదికోట్ల ప్రజల మాయురైశ్వర్యభారమును భారమని యెంచక పోషింపగంకణముగట్టుకొని తల్లిశిశువునుంబోలె గర్భమునధరించి, సూర్యుడస్తమింపని రాష్ట్రమునకు మూలవిరాట్టుగనున్నదో, అట్టితెలిదీవి (బ్రిటన్)లోని యాదిమప్రజలయిన బ్రిటనులు రెండువేల సంవత్సరములక్రిందట కొండకోయలరీతి ననాగరికులైనను స్వేచ్ఛగానుండి స్వపరిపాలనము జేసి కొనుచుండ యూరోపుఖండముయొక్క ప్రాగ్దేశముల నప్రతిమాన ప్రతాపమునుజూపుచు దిగ్విజయయాత్రలుసలుపుచు కీర్తికాముడై విహరించుచు బ్రిటనులస్వాతంత్ర్య మపహరింతునని భుజష్పాలనము సేయుచు వారిజన్మభూమిని మ్రింగివేయుదనని ఉవ్విళ్లూరచునుండిన "జూలియస్ సీజర్" అను రోమనుచక్రవర్తివలెగాక ఆకాలమునందే జంబూద్వీపముమధ్యను, కృష్ణా గోదాలరీనదులకును పూర్వ పశ్చిమసముద్రములకును నడుమ యశోభరితమై విస్తరిల్లుచుండిన యాంధ్రరాజ్యమున కభిషిక్తుండయిన శ్రీముఖశాతవాహనుడు, భరతఖండమునకు శిరోభూషణముగా నుండిన మగధరాజ్యము తొంటిప్రాభవమును బోగొట్టుకొని యవన శకపహ్లవాదిశాత్రవులచే జుట్టుకొనబడి యంతఃకలహములచే జీవకళను గోల్పోయి, విపద్దశనొంది యుండుటను జూచి, యుపేక్షించిన దనరాజ్యమునకెక్కడ ప్రమాదముగలుగునో యని మగధరాజ్యముపై దాడివెడిలి, రాజునంతఃపురవాసునిగ జేసి నిరంకుశాధికారమును నెఱపుచుండిన బ్రాహ్మణమంత్రియగు సుశర్మను జంపి మగ