Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖారవేలుని శాసనము.

పుష్యమిత్రుడు బౌద్ధుడు కాకపోవుట వలన రాజ్యమునకు వచ్చిన వెంటనే బౌద్ధమతస్థులను బాధింపనారంభించెను. ఇతడశ్వమేధాది యాగములలెక్కింటినాచరించి బ్రాహ్మణుల నాదరించుచు వచ్చెను. వీని కాలమున ననగా క్రీ.పూ.158వ సంవత్సరమున కళింగ దేశమును బాలించెడి జైనరాజగు ఖారవేలుడు మాగధముపై దండెత్తి వచ్చి మగధ రాజగు పుష్యమిత్రునికి గర్వభంగము గావించెను. ఈ యుద్ధమునందు శాతకర్ణియను నాంధ్రరాజొకడు బహుసేనలను బంపి ఖారవేలునకు దోడ్పడినటుల నుత్కలదేశములోని కటకమునకు దక్షిణమున 19మైళ్ళ దూరముననుండు నుదయగిరిపైన హాతిగంఫా గుహలోని యొక శిలపై మౌర్యరాజకాలము 165వ సంవత్సరమున ఖారవేలునిచే వ్రాయించబడిన శాసనమునందు బేర్కొనబడినది. [1] మొదటి మౌర్యరాజగు చంద్రగుప్తుడు 321వ సంవత్సరమున రాజ్యాభిషేకముబొందినవాడు గావున ఖారవేలుని శాసనము క్రీ.పూ.157వ సంవత్సరమున వ్రాయబడియుండును. కనుక నా కాలమున నాంధ్ర రాజ్యము మగధ రాజ్యమునకు లోబడియుండి లేవనియు స్వతంత్రతను గాంచి యున్నదనియు, మీదు మిక్కిలి మగధ రాజ్యమునకు ప్రత్యర్థిగ నున్నదనియు గూడ స్పష్టమగుచున్నది.

ఆంధ్రులు మగధ రాజ్యమును జయించుట.

శ్రీముఖుడను [2]నాంధ్రభృత్యవంశపు రాజొకడు మగధ రాజ్యమును బాలించెడి సుశర్మయను కాణ్వవంశ జాతీయుని సంహరించి తద్రాజ్యము స్వాధీనము జేసికొనియెనని వాయుమత్స్యవిష్ణుభాగవతాది పురాణములలో జెప్పబడియెను. శాతకర్ణియను నాంధ్రరాజు పుష్యమిత్రునితో ఖారవేలునకైన యుద్ధమునందు ఖారవేలుని పక్షమునుండి యుద్ధము చేసిననాడు మొదలుకొని

  1. Hathigumpha inser in Actes, Sixieme congre's or. tome iii, p.174, Leide 1885.
  2. శ్రీముఖుని పేరు పురాణములలో దప్పుగాబేర్కొనబడినది.