పుట:Andhrula Charitramu Part-1.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రమధికమై రాకపోకలు గలిగిన తరువాత నీ శైవమత మాంధ్రులలో గూడ వ్యాపించెను.

మౌర్యుల కాలము.

(క్రీ.పూ.321 మొదలుకొని క్రీ.పూ.184 వఱకు)

క్రీస్తునకు బూర్వము నాలుగవ శతాబ్ద ప్రారంభమున యవనులీ భరతఖండముపై దండెత్తి వచ్చి పాంచాలము నాక్రమించుకొని మూడుసంవత్సరములు పాలించిన తరువాత చంద్రగుప్తుడను మౌర్యుడొకడు యవనులను బాఱద్రోలి చాణక్యుడను బ్రాహ్మణమంత్రి సహాయమున మగధ రాజ్యమును బాలించుచుండిన నందుని, వాని పుత్రులను జంపి తాను సింహాసనమెక్కి హిమాలయ వింధ్యములకు నడుమనుండు యావద్దేశమునేకచ్ఛత్రముగ నేలెను. ఈతని యాస్తానమునందే యుండిన మేగాస్తనీసను యవన రాయబారి యాంధ్రరాజ్యమును గూర్చి ప్రశంసించినవాడు గాని యాకాలమున నీయాంధ్రరాజ్యము చంద్రగుప్తునికి లోబడియుండెనో లేక స్వతంత్రత వహించియుండెనో దెల్పినవాడుకాడు. చంద్రగుప్తుని కుమారుడగు బిందుసారుని కాలమునందయినను ఆంధ్రరాజ్యము మగధరాజ్యమునకు సామంతరాజ్యముగ నుండెనేమో స్పష్టముగా బోధపడదు. కుంతలదేశమును మౌర్యులు పరిపాలనము చేసినట్లు మైసూరుమండలములోని పండ్రెడవ శతాబ్దము నాటి శాసన మొక దానివలన గన్పట్టుచున్నదని రైసుదొరగారు వ్రాసియున్నారు గాని [1] యా మౌర్యులకును ఈ మౌర్యులకును నెట్టి సంబంధముగలదో స్పష్టముగా బోధపడదు. బిందుసారుడు కుంతలము వఱకు జయించిన యెడల నాంధ్రరాజ్యమీతని కాలమున మగధ రాజ్యమునకు సామంత రాజ్యముగ జేయబడియుండవలయును. ఇతడు యుద్ధము చేసి యాంధ్రదేశమును జయించినట్లెక్కడను గానరాదు. ఈతని శాసనములయిన నీదేశమున నెక్కడను గానరావు. వీనికొమారుడశోకవర్థనుని కాలమునందు నాంధ్రరాజ్యము వానికి లోబడియుండినట్లు గన్పట్టుచున్నది గాని యతడైనను యుద్ధము చేసి జయించినట్టు గన్పట్టదు. ఈ యశోకవర్ధన చక్రవర్తి ప్రేరే

  1. Mr. V.A.Smith's Early History of India, p.139.