పుట:Andhrula Charitramu Part-1.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియొకటి లేదనియు, ఆంధ్రరాజ్యమునందప్పుడు ముప్పది దుర్గములును లక్ష కాల్బలమును, రెండువేల యాశ్వికసైన్యములు సహస్ర దంతావళములు నుండెననియు నుడివియున్నాడు. [1]

ఆంధ్రవిష్ణువు.

మౌర్యవంశ స్థాపకుడయిన చంద్రగుప్తునికి బూర్వముననే యీయాంధ్ర రాజ్యముండెనని మేగాస్తనీసు వాక్యమువలన ధ్రువపడుచున్నది గాని యీ రాజ్యమును మొదట స్థాపించిన పరాక్రమశాలి నామము మాత్రము చరిత్రమునందు గానరాకయున్నది. అయిననొక గాథ పురాణాదులయందు బేర్కొనబడుటయేగాక నేటికిని జనపరంపరచే వాడుకొనంబడుచు సుప్రసిద్ధి వ్యాప్తిగాంచియున్నది. కాకులమునందు రాజ్యపరిపాలనము సేయుచుండిన సుచంద్రుడనువాని కుమారుడు "ఆంధ్రవిష్ణువు" అనువాడు నిశంభుడను దానవునితో బదమూడు మహాయుగములు యుద్ధముచేసి వానిని హతముగావించి శ్రీశైలము; భీమేశ్వరము, కాలేశ్వరముల నడుమ బ్రాకారములు నిర్మించి కోటగట్టి యాత్ర క్షేత్రములను త్రిద్వారములుగజేసి త్రిశూలధారియైన యీశ్వరునిగాపువెట్టి ఋషులతోగూడ గోదావరీ తీరమునందు నివసించెననియు అప్పటినుండియు నీదేశము త్రిలింగదేశమని వ్యవహరింపబడుచున్నదనియు జెప్పెడి గాథ మూలమున నేసత్యమును లేక కల్పింపబడినదని మా యభిప్రాయముగాదు. ఈ గాథలో బేర్కొనబడిన కాకులము కృష్ణా మండలములో మచిలీపట్టణమునకు బడమట 19మైళ్ళ దూరమున గృష్ణవేణీ తటముననుండిన శ్రీకా

  1. Next come the Andrae a still more powerful race which possesses numerous villages and thirty towns defended by walls and towers, and which supplies its king with an army of 100000 infantry, 2000 cavalry and 1000 elephants. Mc.Crindle's Magesthenes p.138.