పుట:Andhrula Charitramu Part-1.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భించియుండలేదు. సాంకర్యమును నిరోధించు నిబంధనలు వీరి సూత్రములలోనే యుండెను గాని యాచరణమునకు దేబడి సాంకర్యమును నిలుపునట్లు చేయబడలేదు. దీనికిగారణమార్యులల్ప సంఖ్యాకులులుగను, అనార్యులు బహుసంఖ్యాకులులుగ నుండుటయు, ప్రభుత్వాధికారము జాలవఱకు మిశ్రజాతుల వశమునందుండటయేగాని వేఱొండుగాదు. ఆర్యసంఘమనార్య సంఘముల వాతబడి హతమునొందకుండ గాపాడినది యీ మిశ్రజాతి సంఘమెగాని మఱియొకటిగాదు.

అనార్యాంధ్రుల మతము.

ఆ కాలమునందలి యనార్యాంధ్రుల మతము శ్రేష్ఠమైనది కాదు. అనార్యాంధ్రులలో వేఱ్వేఱు తెగల వారు వేఱ్వేఱు మతములను గలిగియుండిరి. లేశమాత్రమును నాగరికత లేక మృగప్రాయులుగ నుండినవారాదిమ నివాసులు. వారికి గొలుచుటకు దేవతలు లేదు. వీరు దయ్యములను పిశాచములను నమ్మి వానింగొలుచుచుండిరి. ఆర్యులు వీరిని రాక్షసులుగను పిశాచులుగను జూచుచుండిరి. మొదట వీరిని జయించినవారు నాగులు, ఆదిమనివాసులకంటె వీరు కొంచెము నాగరికత గలవారయినను వీరి మతము మాత్రము శ్రేష్ఠమైనదికాదు. వీరు వృక్షములను, సర్పములను బూజించుటయేగాక తాము వీరాగ్రేసరులగుటచేత వీరత్వమునకు బ్రసిద్ధిగాంచిన "కాళి” యను భయంకరమైన దేవతలను బూజించుచుండిరి. ఆమెకు దున్నపోతులను బలిపెట్టుచుండిరి. కాళియొక్క విగ్రహము మిక్కిలి భయంకరముగా శృంగారింపబడుచుండెను. ప్రకాశమానమైన యొక చిన్న త్రాచుపాముయొక్క చర్మముతో గప్పబడి యల్లిక వేయబడిన వెండ్రుక జడ శిరస్సుపైన గిరీటమువలె గట్టబడుచుండెను. అడవి పందియొక్క వంకర కోఱను చందురు వంక వలె (అర్థచంద్రాకృతిగ) నుండునట్లు తలకట్టునకు గట్టబడుచుండెను. పెద్దపులి దంతములతో గూర్పబడిన సరము కంఠమునందలంకరింపబడుచుండెను. వ్యాఘ్రచర్మము వస్త్రమువలె నడుమునకు జుట్టుబడుచుండెను. వంచబడిన బలమైన విల్లొకటి చేత నుంచబడుచుండెను. చిలువలు పలువలు గలిగిన దుప్పికొమ్ములతో పొడవుగల మగకణితిమీద నెక్కింపబడు