గ్నులను దమతమగృహములలో నెలకొల్పుచునేయుండిరి. వీరలు యజ్ఞయాగాదికర్మల నాచరించుటయం దత్యంతోత్సాహాభి నివేశముల జూపుచుండిరి. మంత్రవిధుల ప్రకారము హయమేధములను గోమేధములను జేయుచుండిరి. ఈ పశుహింసా కృత్యమంతయు బరమరహస్యముగా విశాలమయిన గృహావరణములలోనే జరుపబడుచు వాని మాంసమును బ్రాహ్మణులు భక్షించుచుండిరి. వేదవేత్తలయిన యధ్వర్యులచేత నీ యజ్ఞములు నెఱవేర్పబడుచుండినవి. యజ్ఞాచరణకాలమున ననార్యుల వలన నేయాపత్తును గలుగకుండ రాజరక్షణము గలిగియుండిరి. అయినను బ్రాహ్మణులు వేదములన్యులకు బోధపడకుండ బరమ గోప్యముగా నుంచుకొనుచువచ్చిరి. ఆ హేతువుచేత వేదములలో జెప్పబడిన పృథివ్యాపస్తేజోవాయురాకాశముల పూజ అనార్యజాతులచే నంగీకరింపబడకయుండెను. అప్పటికే యార్యులలో నౌత్తరాహులకును దాక్షిణాత్యులకు నాచారబేధము లేర్పడినవి. ఆర్య మతము నందు బ్రవేశపెట్టబడనివారితో గలిసి భుజించుటకు, భార్యతో గూడ గలిసి భుజించుటయు, చప్పని అన్నము (చల్ది) భుజించుటయు, మేనమామయొక్కయు, మేనత్తయ్కొయు కూతురిని బెండ్లాడుటయు దక్షిణమున మాత్రమే తప్పని యాచారములుగనుండెను. గొఱ్ఱె మొదలగు కొన్ని జంతువుల రోమములతో (బొచ్చు) వ్యాపారము చేయుటయు, బెల్లపుసారాయి త్రాగుటయు, పై దౌడలను క్రింది దౌడలను పల్లుగలిగిన జంతువులను మాత్రమె విక్రయించుటకు, ఆయుధవ్యాపారమవలంబించుటయు నావికాయాత్ర చేయుటయు నుత్తరమున మాత్రమె దప్పని యాచారములుగ నుండెను. ఔత్తరాహులు దాక్షిణాత్యుల యాచారములనుగాని దాక్షిణాత్యులౌత్తరాహుల యాచారములను గాని యవలంబించుట పాపముచేయుటగా శాసింపబడుచుండెను. ఏ దేశముననేది యాచారముగానుండెనో అయ్యది యా దేశ విధులనతిక్రమింపరాదు. అయినను గౌతముడు దీనినంగీకరింపలేదు. ఆపస్తంబునికి బూర్వమునందుండిన బోధాయనాది సూత్రకారులు శాస్త్రీయ సంతానమునకును అశాస్త్రీయ సంతానమునకును భేదమునెంచక ద్వాదశవిధ పుత్రులను నంగీకరించి జ్యేష్ఠపుత్రునకు జ్యేష్ఠభాగమును విధించియుండగా నాపస్తంబుడు దానినాక్షేపించి అశాస్త్రీయసంతానమునకు శాస్త్రీయ సంతా
పుట:Andhrula Charitramu Part-1.pdf/114
Appearance