చేత గాబోలు నాంధ్రదేశములోనివారికి నాపస్తంబ సూత్రములు విశేషగౌరవనీయములు. ఈ యాంధ్ర దేశములోని నియోగివైదిక బ్రాహ్మణులలో మూడువంతులాపస్తంబసూత్రులుగానున్నారు. ఇతడాంధ్రదేశములోని వాడనుటకు లేశమాత్రమును సందియములేదు. ఇతడు బోధాయనునకు దరువాతికాలమున నున్నవాడు. ఆపస్తంబ ధర్మసూత్రములను జక్కగా బరిశోధించి ఆంగ్లభాషలోనికి భాషాంతరీకరించిన డాక్టరు బూలరుదొరగారీ సూత్రకారుడాంధ్రదేశములోనివాడనియు, క్రీస్తునకు బూర్వము నాలుగువశతాబ్దమునగాని, యైదవ శతాబ్దమునగాని యుండియుండుననియు వ్రాసియున్నారు. [1] బోధాయనునికాలమున సందిగ్దములుగను అపరిశుద్ధములుగ నుండిన ధర్మశాస్త్రవిషయముల బెక్కింటిని ఆపస్తంబుడు సంస్కరించి విస్పష్టముగదెలియజెప్పెను. ఆపస్తంబునకు బూర్వమార్యసంఘమునందలి యాచారములంతగా నియమబద్ధములుగాక యుండెను. సంఘసాంకర్యమున కవకాశమిచ్చి యుండెను. అట్టి సాంకర్యమును విరోధించు నిబంధనల నాపస్తంబుడు విరచించెను. అవంతి, (మాళవము), అంగము (తూర్పుబేహారము), మాగధము (దక్షిణ బేహారము), సౌరాష్ట్రము (గుజరాత్), దక్షిణాపథము (డెక్కన్), ఉపవ్రీతము, సింధు, సౌవీరము (దక్షిణపంజాబు లేక పాంచాలము), దేశములలోని జనులు సంకరులనియును, పంజాబులోని ఆరట్టులను, సౌవీరులను, దక్షిణాపథములోని కారక్షరులను, ఉత్తరబంగాళములోని పుండ్రులను, తూర్పు బంగాళములోని వంగీయులను, ఉత్కలదేశములోని కాళింగులను సందర్శించినవాడు పునస్తోమమను యజ్ఞమును చేయవలయునని బోధాయనుడు వచించెను.
బోధాయనాపస్తంబుల కాలమునాటి కార్యులు పెక్కండ్రు దక్షిణాపథమునకు వచ్చి యాంధ్రదేశమున నివాసము లేర్పఱచుకొనుచుండిరి. అప్పటికీ యార్యబ్రాహ్మణులు పృథివ్యాపస్తేజోవాయురాకాశములను బూజించుటను విడిచిపెట్టి యుండలేదు. వీరిలో గొందఱు వైదికకాలమునందువలె ద్రేతా
- ↑ See the introduction to the Sacred Laws, VolII of the Sacred Books of the East edited by F.Max Muller.