పుట:Andhrula Charitramu Part-1.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యముగా నాగరాజచ్చట నివసించియుండెను. ఎన్ని విధములచేత జూచినను ఆ ప్రదేశమిప్పటి యమరావతి ధరణికోట గావలయునుగాని మఱియొక ప్రదేశము కాజాలదు. వీనినన్నిటినిబట్టి చూడగా నా గాథలలో నుదాహరించబడిన కట్టడము "అమరావతి స్తూపము" అని నిశ్చయముగా జెప్పవచ్చును. అమరావతీ స్తూపమును మనము చక్కగా బరిశోధించితిమేని అందు చిత్రింపబడిన చిత్రపుబొమ్మలను జూచితిమేని నాగులు నాగరాజులెట్లు ప్రదర్శింపబడిరో, ఈ పై గాథలలోని వృత్తాంతముల జిత్తరవుల మూలమునకెట్లు దెలుపబడియెనో మనకు గోచరము గాకమానదు. వానిబట్టియే పూర్వమీ ప్రదేశము నాగులకాటపట్టయి నాగరాజులచే బరిపాలింపబడెనని స్పష్టముగ జెప్పవచ్చును. ఇద్దఱు మనుష్యులు బుద్ధుని బొమికలు పట్టుకొని పడవటాపు మీద నిలుచుండి యొడ్డునకు వచ్చుచుండగా నాగరాజొకడు వారలకు స్వాగతమీయ వచ్చుచున్నట్లును నొక చిత్తరవు చిత్రింపబడియున్నది. ఇంకను నాగరాజులకును రాజకుమారితో నుండిన రాజుకొమారునకును కలిగిన సమావేశములను దెలిపెడు రీతులుగల చిత్తరవులనేకములు చిత్రింపబడియున్నవి. అమరావతి ధరణికోట (ధాన్యకటకము) నాగరాజునకు రాజధానిగ నుండెనని యీ చిత్తరువులు ముఖ్యముగా దెలుపుచున్నవి. ఈ చిత్తరువులలోని నాగరాజుల కేడేసి పడగలుగల పాములు శిరమునకు వెనుకప్రక్క నుండియున్నవి. ఇట్లే రాణులకు మూడేసి పడగలుగల పాములుండియున్నవి. ఇతర నాగులకు నొక్కపడగ మాత్రమెగల పాములుండియున్నవి. వీనినంతయునుబట్టి చూడగ బౌద్ధమతమునకు బూర్వము మన దేశమున సర్పపూజ విశేషముగనున్నట్లు గన్పట్లుచున్నది.

నాగులే ద్రావిడులు.

ద్రావిడులాసియా ఖండ మధ్యమునుండి యార్యులకంటె బూర్వమెన్నడో యీ దేశమునకు బశ్చిమోత్తర మార్గమునవచ్చి దక్షిణాపథముయొక్క దక్షిణపు గొన వఱకు బోయిరనియు, ఆర్యులు రాకపూర్వమె కొంతవఱకు నాగరికత గలిగి యున్నారనియు జెప్పబడుటయెగాని వారి చరిత్ర మిట్టిదని చె