సములకు దంతపురమునకుబోయిరి. దంతపురమునందు మేఘవర్ణుని రాయబారులర్హవిధానమున సన్మానింపబడిరి. మూడవ గాథ మఱియొక్కటి కలదు. కర్నలు లోగారది మఱియొక్క రాజునుగూర్చినదనియు వేఱు విషయములను గూర్చినదనియు దలంచుచుండిరిగాని కథాసందర్భమునుబట్టి యొక్కని గూర్చియె యని గన్పట్టుచున్నది. ధర్మాశోకుడను రాజు మిక్కిలి న్యాయబుద్ధితో నరవాడిదేశమును (అవంతికావలయును) బాలించుచుండి క్షామోపద్రవమువలన ముప్పదియొక్క వేలమంది దార్ఢ్యవంతులయిన మనుజులతో దక్షిణ దిశకు నేడునెలలు ప్రయాణముచేసి తుదకు జలమును మత్స్యములును సమృద్ధిగానున్న దేశమునకు వచ్చిరి. మఱుచటినాటి వేకువను నశ్వారూఢుడై రాజు వజ్రాలదిన్నె (Diamonds Sands)బ్రవేశించి యచ్చట నాగరాజును గలిసికొనియెను. ఆ ప్రదేశమునందొక చైత్యమును నిర్మించి యొక నగరమును గట్టించెను. ధర్మాశోకుడు నెమ్మదిగ నిచ్చటనేడేండ్లు రాజ్యపాలనము చేసెనుగాని బుద్ధుని బొమికలు దొరకనందున సౌఖ్యములేనివాడై వానింగనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానము చేసెదని ప్రకటించెను గాని యేమియు ప్రయోజనకారి గాకపోయెను. ఇంతలో రోమురాజు పుత్రుడు కాకభాషియను వాడొకడు తక్షశిలా నగరమునకు వర్తకమునకై యోడనెక్కి యైదువందల పరివారముతో వచ్చుచు దుపానుపట్టియు దైవానుగ్రహమువలన నపాయమునుండి విడివడి తుదకు గష్టముతో వజ్రాలదిన్నె సమీపమునకు వచ్చి జనులుండెడు సూచనలు గనిపెట్టి చూడవలెనను తలంపుతో నచ్చట నోడ నిలిపి లంగరు దించెను.
గాథల సారాంశము.
నాలుగవ శతాబ్ద ప్రారంభమున బుద్ధుని దంతమునుగూర్చి యిండియాలో బుట్టిన కల్లోలములను దెలిపెడి బౌద్ధుల గాథల నిట్టివెన్నియైనం దెలుపవచ్చును. బౌద్ధుల గాథలు (Diamonds Sands) వజ్రాలదిన్నెలను గూర్చి ముచ్చటించుచున్నవి. కృష్ణాతీరమునందు దేవాలయము గట్టబడుచుండెను. నిశ్చ