Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగరాజు దానిని మరల నా రాజదంపతులకే యీయవలసిన వాడయ్యెను. ఆ రాజదంపతులు తరువాత నోడనెక్కి సింహళమునకు బోయిరి. ఇది క్రీ.శ.312వ సంవత్సరమున జరిగినది. వీరు సింహళము జేరునప్పటికి దొమ్మిది సంవత్సరములకు బూర్వమె మహాసేనుడు మృతినొందియుండెను. అయినప్పుడు రాజ్యము చేయుచుండిన మేఘవర్ణుడు వారలను సగౌరముగా నాదరించి యా దంతముపైన నిటుకతోను సున్నముతోను నొక చైత్యమును నిర్మించి మహోత్సవమును సలిపెను. [1]మూడు సంవత్సరములు గడిచిన తరువాత నా లంకాధిపతి నాడు మొదలుకొని యేడు సంవత్సరములలో వజ్రాలదిన్నె మీద (Diamonds Sands)ధర్మాశోకుడను రాజు దేవాలయమును నిర్మించునని పూర్వమొక జ్యోస్యుడు చెప్పినదానింజూచెను. మఱియును బుద్ధుని బొమికలు రెండు ద్రోణములింకను నాగరాజు దేశములో దాచబడియున్నవను సంగతిని జ్ఞప్తికి దెచ్చుకొనియెను. వానిందెచ్చుటకై పరిశుద్ధవర్తనముగల యొక గురువునంపెను. నాగరాజు సోదరుడొకడు బొమికల పెట్టెను సంగ్రమించికొని మేరుపర్వతమునకు బాఱిపోయెనుగాని బొమికలు వానినుండి గైకొనబడి మరల దీసికొని రాబడినవి. అంతట నాగరాజు మనోహరయౌవనాంగుడై సింహళమునకు వచ్చి మేఘవర్ణునికి బ్రత్యక్షముకాగా నాతడు కొన్ని బొమికల నాగరాజునకొసంగెను. తక్కిన బొమికల నొక్క సువర్ణపాత్రమునందుంచి, ఒక మూరెడు పొడవును జేనెడు వెడల్పునుగల యొక బంగారుపడవను నిర్మించి యా సువర్ణపాత్రమునందుంచెను. అటు పిమ్మట నేడుమూళ్ళ దూలము వెడల్పు మాత్రమె గలిగియుండు కొయ్యపడవ నొకదానినిర్మించి యా బంగారుపడవనందుంచి కొందఱు రాయబారులతో దంతకుమారుని హేమాచలను వారి కోరికను మన్నించి వారి దేశమునకు బంపించెను. వీరు బయలుదేఱి యైదుమాసములకు వజ్రాలదిన్నె (Diamonds Sands)జేరి యచ్చట దిగి బొమికలుండు ప్రదేశమును దేవాలయము జూచుకొని మరల బడవనెక్కి మూడుమా

  1. Colnol Low p.86