లుగూడ గలరని తెలియుచున్నది. [1][2]ఇంతియగాక నెల్లూరు మండలములోని దర్శి వంశపు రాజులు కూడ నాగజాతి వారని తెలియుచున్నది. పదునేనవ శతాబ్ద ప్రారంభమున దర్శి పట్టణపు రాజగు ఆసనదేవమహారాజు తన తల్లి ఆర్యమదేవి పేరిట నొక చెఱువు త్రవ్వించి శాలివాహన శకము 1357వ సంవత్సరముననగా క్రీస్తు శకము 1435-36వ సంవత్సరమున నొక శాసనము వ్రాయించెను.
దానిలో గొంకరాజు మొదలుకొని తన వంశమును వర్ణించుకొనియుండెను. ఆ శాసనమునందు గొంకరాజును ఫణీంద్రవంశజుడనియు, నాగవంశోద్భవుడనియు నభివర్ణించెను. ఈ గొంకరాజు యొక్క మనుమడయిన నాగరాజును కాకతీయ గణపతి రాజులకు సామంతుడుగనుండిన నాగదేవుడును నిరువురు నొక్కరేయై యుందురేమో యింకను విచారింపవలసియున్నది. ఈ పైన వ్రాసిన యంశములనుబట్టి నాగులనియెడి యొక జాతివారు పూర్వకాలమున నుండిరనియు, ఒకప్పుడు వారలీ భరతఖండమునంతయు నాక్రమించి పాలించి యుండిరనియు దేటపడకమానదు. ఇంకను వారలకును నాంధ్ర దేశమునకునుగల సంబంధమును దెలిపెడి గాథలను దెలిసికొన్నచో నాగులను గూర్చి యభిప్రాయము మఱికొంత బలపడకమానదు.
బౌద్ధులగాథలు.
సింహళ ద్వీపమునందును సయాము దేశమునందును జెప్పుకొనబడు బౌద్ధుల గాథలలో నాంధ్రదేశము నాగులదేశముగా జెప్పుకొనబడినట్లుగా గన్పట్టుచున్నది. గంగానదీ ముఖద్వారమునకును సింహళద్వీపమునకును నడుమ నాగులచే నివసింపబడు దేశము కలదు. ఈ నాగులు బుద్ధునియొక్క బొమికల