పుట:Andhravijnanasarvasvamupart2.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుమునకు బంకగరుములును, గరుములు అనుకూలములు. నేలను 3, 4 చాళ్లు దున్ని నాగటిచాలులో విత్తులను అడుగున కొకటిచొప్పున వేసి కప్పవలెను. ' ప్రత్యేకముగ జల్లునెడల ' ఎకరమునకు 16-20 సేర్ల విత్తులు పట్టును. 5, 5 నెలలలో పంట పూర్తియగును. సామాన్యముగ 40-60 కుంచముల యనుములును అరబండి యొత్తును అగును.

అనుపచేని కొకవిధమగు పేను తరచు పట్టుచుండును. గొంగళి పురుగులును ఒక్కొకప్పుడు నష్టమును గలిగించుచుండును. ఇతర పయరసస్యములకు వలెనే దీనికిని పూతకాలమున మబ్బులును, తేమగాలియు ప్రతికూలము. అనుములు మనుష్యులకును, పశువులకును గూడ ఆహారముగ నుపయోగించును. సాతాళించిన యనుములు చాలచోట్ల అంగళ్లలో విక్రయింపబడుచుండును. పచ్చికాయలలోని గింజలు కూరలలో నుపయోగింతురు. అనుపగుగ్గెళ్లు పశువులకు మంచి దాణా. అనుపబొత్తు పశువులకు బ్రియము.

అనుముల యొక్కయు, అనుపబొత్తు యొక్కయు పృథక్కరణ మీ క్రింద వివరింపబడును.


అనుము పశువులమేత కొరకు బ్రత్యేకముగ బెంచదగిన సస్యములలో నొకటి. పచ్చియెరువునకును దీని రొట్ట ప్రశస్తము. ఇందు నూటిని 0.65 పాలు నత్రజనియు, 0,16 పాలు స్ఫురత్పంచామ్లజనిదమును, 0. 56 పాలు పొటాషును గల వని లెక్కవేయబడెను.

అనుములు నలుగగొట్టి నీటిలో నానవేసిన యెడల నొక్కొకప్పుడు ఉదజనయనికామ్లము ( Hydrocyanic acid ) అను విష ద్రవ్యము జనించు నని డాక్టరు వెదరుగారు కనుగొనిరి. ( గో. జో. )

అనుమునిలంక - పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం తాలూకాయందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య (1,509 (1931).

అనుములుకొండ - నెల్లూరు జిల్లా, కనిగిరి తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 80 (1931).

అనుయసంగీతవిలాసము - భావభట్టకృతమగు సంగీతశాస్త్రగ్రంథము : సంస్కృతము.