పుట:Andhravijnanasarvasvamupart2.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుపల్లవి - కర్ణాటకగానమున కీర్తనాదులయందు ద్వితీయభాగము. పల్లవి ననుసరించి యుండి దానికి సమప్రాసము గల్గినదిగ నుండును.

అనుపల్లి - 1. చిత్తూరు జిల్లా, చిత్తూరు తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 357 (1931). 2. చిత్తురు జిల్లా, పుత్తూరు తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 888 (1931).

అనుపల్లిపాడు - నెల్లూరు జిల్లా, నెల్లూరు తాలూకా యందలి ఈనాం గ్రామము. జనసంఖ్య 29 (1931).

అనుపాతకము - బ్రహ్మహత్యాదులకు సమానమైన వేదనిందాదిజన్య పాపవిశేషము. యజ్న మొనరించుపురుషుడు క్షత్రియుడు, వైశ్యుడు, రజస్వల, గర్భిణి, అత్రిగోత్రీకుడు, అవిజ్నాతుడు, శరణాగతుడు మున్నగువారిని జంపుట, గర్భపాతము గావించుట మొదలగునవి బ్రహ్మహత్యాసమానము లని విష్ణువు వక్కాణించి యున్నాడు. ఇది ముప్పదియైదు ప్రకారములు. ఔన్నత్యమునందు మిథ్యాకథనము: ఇది రెండు విధములు; ఒకటి తనకే చెందునది; రెండవ దితరులకు చెందునది. రాజుయొక్క పైశున్యము. తండ్రి మిథ్యాదిదోష కథనము ఈ మూడు బ్రహ్మహత్యాసమాన దోషములు. వేదత్యాగము- అనగా జదివిన వేదమును మరచుట, వేదనింద. కూటసాక్ష్యము- ఇది రెండు విధములు - తెలిసినదానిని దెలియ దని చెప్పుట, తెలియనిదానిని తెలియునని చెప్పుట. మిత్రవధ - అనగా బ్రాహ్మణాతిరిక్త మిత్రవధ, తెలిసియు జండాదుల గర్హితాన్నమును భక్షించుట, జ్నానపుర్వకముగ చత్రకాదుల భక్షణము. ఈ ఆరు ప్రకారములగు పాపములు సురాపానతుల్యములు.

నిక్షేపహరణము, నరహరణము, అశ్వహరణము, రజతహరణము, భూమిహరణము, వజ్రహరణము, మణిహరణము నీయేడు సువర్ణస్తేయ సమానములు.

సపిండస్త్రీగమనము, కుమారీగమనము, అంత్యజాగమనము, మిత్రస్తీగమనము, ఔరసేతరపుత్రస్త్రీగమనము, పుత్రునియసవర్ణస్త్రీగమనము నీయారు విమాతృకాగమనతుల్యములు. మాతృష్వసృగమనము, పిస్తృష్వసృగమనము, శ్వశ్రూగమనము, మాతులానీగమ