పుట:Andhravijnanasarvasvamupart2.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనింగ్యము - ఇది నూరు శ్లోకముల చిన్న పుస్తకము. తైత్తిరీయసంహితలొ గొన్ని వైదికపదములు ' పదపాఠము ' నందు విడిపోవునవిగ గన్పట్టును. అట్లు కాన్పించుటయేకాని నిజముగ నట్లు విడదీయుటకు వీలు లేని వవి. ఈ గ్రంథము వ్రాసిన యతడు దేవమనీషి కుమారుడు శ్రీవత్సాంకుడు.

అనికేపల్లి - 1. నెల్లూరు జిల్లా, నెల్లూరు తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 1,846 (1931). 2. నెల్లూరు జిల్లా, కనిగిరి తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 736 (1931).

అనిగండ్లపాడు - కృష్ణజిల్లా, నందిగామ తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 2,657 (1931).

అనిగానిదొడ్డి - అనంతపురము జిల్లా, గుత్తి తాలూకా యందలి గ్రామను. జనసంఖ్య 295 (1931).

అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 97 (1931). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామముల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు గవర్నమెంటు వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.

అనిజిగేరి - బళ్లారి జిల్లా, హర్పణహళ్లి తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 1,931 (1931).

అనితల్లి - కాటయవేమారెడ్డికి గూతురు. కాశీఖండమును కృతినందిన వీరభద్రారెడ్డికి భార్య. ఈమె తల్లి పేరు దొడ్డాంబిక. ఈమె తండ్రి యైన కాటయవేమారెడ్డి కొండవీటి యనపోతారెడ్డికి (1358 - 1362) అల్లుడు, మేనల్లుడును. కుమారగిరిరెడ్డికి (1380 - 1400) జెల్లెలి పెనిమిటి, మంత్రి. కుమారగిరి కాటయ