పుట:Andhravijnanasarvasvamupart2.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అనాసతోటలు వర్షాకాలమున నాటబడుటచే నాటినపు డొకసారి నీరు పోసిన జాలును. సింహాచలమున నదియు చేయబడుట లేదు. తోటలలో నాటిన వెనుక నొకసారి కలుపు తీయుట తప్ప నాసంవత్సరమున మరియే పనియు జేయబడుట లేదు. తరువాతి సంవత్సరములం దేటేట కాయలకోత ముగిసిన పిమ్మట నేల నొకసారి త్రవ్వి తుప్పలను దీసివేయుదురు. వర్షము వలన నెచటనైన నంతరములు చెదినచో నవి బాగుచేయబడును. 3 సంవత్సరము లయిన పిమ్మట పిల్కలు హెచ్చుగ బయలుదేరుచో వానిని దీసివేయుదురు. సమప్రదేశములందు పిల్కలను నాటిన వెనుక తోటలలో నవసరమైనపుడెల్ల (అధమము రెండుసార్లయినను) గొప్పు త్రవ్వి కలుపు తీయచలెను. తోట కాపునకు దిగిన పిమ్మట పదును తగినంత లేనిచో నీరు కట్ట నారంభింపవలెను. వేసవిలో నిట్లు 4-8 తడు లవసరము కావచ్చును. ఎండ తీవ్రముగగాసి, కాయలు డాగుపడు నని తోచినచో వానికి అరటిచొరుగు చుట్టి కాపాడవలెను. మరుసటి సంవత్సరము నుండి ప్రతియేడును, కాయలకోత పూర్తి యయిన పిమ్మట తోటలో పైపైని పొరలలో త్రవ్వి కలుపుతీసి యెరువు వేయవలెను. వేసవిలో పైని చెప్పినట్లు నీరు కట్టవలెను.

అనాసతోటలకు బూడిదతో గూడిన పశువులపెంట అనుకూలము. ఎకరమునకు ఏటేట 30 - 50 బండ్లు వేయవలెను. దానికి దోడు కొంత తైలపిష్టము గాని, అమ్మోనియా గంధకితము గాని వేయుట చాలచోట్ల లాభకరముగ నుండును. మొక్క 1-కి 2-3 ఔన్సుల తైలపిష్టము (వేరుసెనగ లేక ఆముదపుపిండి) గాని ఔన్సు అమ్మోనియా గంధకితము గాని వేయవచ్చును. దీనిని పశువులపెంటతో