పుట:Andhravijnanasarvasvamupart2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

అనంతపురం జిల్లా

ఈ జిల్లా యందలి జనులలో నూటికి తొంబై మంది హిందువులును, తొమండ్రకుపైగా మహమ్మదీయులునూ గలరు. ముఖ్య మతముల ననుసరించి ఈ జిల్లాయందలి జనసంఖ్య యీ క్రింద 'తాలూకావారి'గా నీయబడినది.

తాలూకా హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు
అనంతపురము 1,06,648 9,587 676
ధర్మవరము 84,895 4,762 349
గుత్తి 1,36,826 20,450 2,293
హిందూపురము 98,345 11,470 309
పెనుకొండ 89,663 8,598 227
కదిరి 1,50,259 22,338 655
కల్యాణదుర్గము 83,850 3,503 83
మడకశిర 92,698 3,489 46
తాడిపత్రి 1,00,584 14,761 1,908
---- ---- ----
మొత్తము 6,43,768 98,954 6,546

జైనులీకిల్లాయం వేయిమందికి పైని కలరు. అందు 848గురు మడకశిర తాలూకాయందున్నారు.

వ్యవసాయము

జిల్లాయుత్తరభాగమునందుఁ దక్క ముగునినభాగమునం దంతటను భూమి మిక్కిలి బీదది; ఫలవంతము కాదు. ఉత్తరపు తాలూకాలలోని రేగడిభూమియు నంత శ్రేష్ఠ మయినది కాదు. ఈజిల్లాలో పెద్ద ఆనకట్టలు కానీ, ఏటికాల్వలు కాని లేవు. అందుచేత చెఱువుల యాధారమును, బావులయాధారమును మాగాణిపైరులు, తోఁట పైరులు చేయుదురు. ఈ జిల్లాయం దిరువదివేలవఱకు బావులు కలవు. మిక్కిలి బెట్టకాలములో బావు లతగ నుపయోగపడవు. మెరక పైరులలో కఱ్ఱజొన్న, రాగి ముఖ్యమైనవి. కొద్దిభూమి చేసి ఎక్కువపైరును, వెలగల పైరును పండించుటకు బదులుగా రైతులు ఎక్కువభూముని దున్ని కొద్దిపైరులను బీదపైరులను పండించెదరు. 1340-వ ఫసలీ, అనఁగా 1930-31-వ సంవత్సరమున 'రైతాధీన'మం దున్న భూమి 18,11,709 యెకరములు. దీనివలన వచ్చు శిస్తుమొత్తము రు. 13,39,033లు. ఈ 'భూమి పరిమితము'న 16,90,008 యెకరములనేల మెట్టవ్యవసాయము; 1,21,701 యెకరముల నేల పల్లపు వ్యవసాయము (నీరుపాఱించి చేయునది). ఇప్పటికిని బీడుభూమి లేఁటేఁటను సాగాగుచున్నవి.

ఈ మండలమున పచ్చికబయళ్ళు మెండుగా లేకపోవుటచేత ఇచ్చట పుట్టు పశువులంత శేష్ఠమయినవి కాకయున్నవి. అందువలన నెల్లూరి ప్రాంతపు బలిష్ఠములయిన కోడెలను మంచివెలకుఁ గొని తీసుకొనివచ్చుచుందురు. ఉన్నికొఱకీమండలమునందు గొఱ్ఱెలను మేఁకలను ఎక్కువగాఁ బెంచెదరు. ఈయున్నితో చాలగ్రామములందు రత్నకంబళ్ళు నేయుదురు.

కఱవులు

ఈ జిల్లాయందు వర్షపాతము చాల తక్కువ యగుటవలన పైరుపంటలకు తగినంత నీరు దొరకక తఱుచుగ కఱువు సంభవించుచుండును;ఒక్కొక్కప్పుడతివృష్టి కలిగి పంటలు చెడి కఱవు సంభవించుటయు కలదు. కడచిన శతాబ్దియందు 1803,1824,1833,