పుట:Andhravijnanasarvasvamupart2.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీటిఏర్పాటు:- బుద్ధఘోషు డిచ్చట నుండిన కారణమున ఈ పట్టణముకు నీటి ఇబ్బంది లేకుండాజేయుటకై ధారుసేనుడను రాజు క్రీశ 150 లో పట్టణమునకు నేబది మైళ్ళ మీద " కాల వాపి" అను తటాకమును నిర్మించెను. 14 మైళ్ళ పొడవుగల దానికట్ట ఇప్పటికీ అరణ్యప్రాంతమున గానవచ్చును. అప్పుడు దాని చుట్టుకొలత 50 మైళ్ళట. అందుండి పట్టణముకు వచ్చిన కాలువలు ఇప్పిటికీ మంచి స్థితియందు ఉండినవి. మానవుల చేత నిర్మించబడిన తటాకములలో నా కాలములో నింతకంటే పెద్దది లేదని చెప్పవచ్చు. ఇదియే అనూరాధాపురమున జరిగిన గొప్ప వైభవకార్యము. ఇక మీద ఆ వైభవము తగ్గజొచ్చెను.

అటు పిమ్మట రాజ్యమునకై పెక్కు వంశరాజులు పోరాడుచూ ఒకప్పుడు వీరును ఒకప్పుడు వారునూ విజయమునందుచూ వచ్చిరి. ఓడిన వారు తమిళుల సాయము దీకొనుచుండినందున గ్రమముగా ఈ ప్రదేశమున దమిళులు బ్రవేశించి దోచుకొనజొచ్చిరి. క్రీ.శ 210 లో నీ పట్టణము విడిచి పులస్తిపురమను దానిని సింహళముకు రాజధానిని జేసిరి. 11వ శతాబ్ధమున దీనిని రాజధానిగ జేయ బ్రయత్నము జరిగినది అయినను సఫలమైనదికాదు. క్రీ.శ 1,300 ప్రాంతమున నిది బొత్తిగ బాడుపడినట్లు కానవచ్చుచున్నది. చుట్టు పక్కల 50 మైళ్ళ దూరము అరణ్యము పెరిగినది. ఇప్పుడు రెండు మూడు బౌద్ధభిక్షువుల గుడిసెలు తప్ప మరే ఇల్లు కనిపించుట లేదు.

ఇటీవల నీ ప్రాంతముల నుండి రోడ్లు రైళ్ళు పడినందున దొరతనము వారు బంగళాలను కట్టుకొని వాసము చేయుచున్నారు. శిధిలమైన కట్టడములను దొరతనము వారు నింకను చెడిపోకుండా రక్షణ చేయుచున్నారు.

అనూరు తూర్పుగోదావరి జిల్లా పెద్దపురమండలము లోని ఒక గ్రామము. జనసంఖ్య 1,384.

అనూరుడు - సూర్యుని సారధి. తొడలు లేనివాడగుటచే నితనికీ పేరు వచ్చినది. (చూడుడు అరుణుడు).

అనేక వర్ణ సమీకరణము - భాస్కరాచార్యుల వారు బీజ గణితమునందు దేనికీ అనేకవర్ణ సమీకరణమను పేరు పెట్టిరో దానిని పాశ్చాత్య బీజ గణితశాస్త్రమందు " సైనులు టేనియస్ ఈ క్వేషన్ " అందురు. దీనికి సమకాలిక- సమీకరణమని అర్ధము. ఏకవర్ణ సమీకరణమందు దెలియని వర్ణము మొక్కటియే యుండును. అనేక వర్ణ సమీకరణమందు దెలియని వర్ణములు పెక్కులుండును. వాని వెలలు కనుగునవలయును.

1వ ఉదాహరణము :- రెండు సంఖ్యలున్నవి వానిలో చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యలో కలిపిన y4 వచ్చును. చిన్నసంఖ్య ను పెద్ద సంఖ్య నుండి తీసివేసిన 12 వచ్చును ఆ సంఖ్యలేవి?