పుట:Andhravijnanasarvasvamupart2.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీనిమీద వాత్స్యాయను డిట్లు భాష్యము వ్రాసినాడు. " విహితమైన యథమును మరల నేల చెప్పవలె నన్న అధికారార్థము ( చెప్పబోవు విషయ మిది యని తెలియుటకు ), విహిత మైనదానిని నిందించుటకుగాని, స్తుతించుటకుగాని, విధి శేషముగ గాని చెప్పబడును. విహితార్థమునము దరువాత వచ్చినదికూడ ననువాదమగును...లోకమునందును అనువాదము కలదు. ' వండు వండు ' అని చెప్పుట కలదు. అందులకు ద్వరగ వండు మని కాని, దయచేసి వండు మని కాని (అధ్యేషణ ), తప్పక వండు మని కాని (అవధారణ) అర్థ మగుచున్నది ".

పైని వర్ణింపబడిన మూడువిధము లైన వాక్యములలో విధి వాక్యములే ప్రమాణములు గాని మిగిలిన రెండు విధము లైన వాక్యములును ప్రమాణములు కా వని కొందరు పూర్వపక్షము చేసెదరు.

అనువిందుడు - 1. విందుని తమ్ముడు. వసుదేవుని తోబుట్టు వగు రాజాధిదేవికిని, ఆమె పెనిమిటి యవంతిరాజు జయసేనునకును బుట్టినవాడు. శ్రీకృష్ణునకు మేనత్తకుమారుడు. భారత యుద్ధమునందు దుర్యోధనపక్షమున బోరాడి అర్జునునిచే జచ్చెను. 2. కేకయరాజుయొక్క ఇద్దరు పుత్రులలో నొక్కడు. వీని అన్న విందుడు. భారతయుద్ధమునందు బాండవపక్షపాతియై యుండె. 3. దృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో నొక్కడు.

అనువు - 1. యయాతి కుమారుడు, శర్మిష్ఠకు జన్మించినవాడు. తండ్రి ముసలితనము గైకొనుటకు అనువు ఒప్పుకొనలేదు. ఈ కారణమున నతని రాజ్యాధికారము పోయెను. తరువాత నతడు మ్లేచ్ఛ రాజ్యమున కథిపతి యయ్యెను. ఇతని కుమారులు చక్షు, సభానరులు. 2. క్రధవంశమునకు జెందిన కపోతరోముని కుమారుడు. అనువు కుమారుడు అంధకుడు.

అనువైణేయము - అయోధ్యా ప్రాంతమునందలి యొక పురాతన ప్రదేశము. దీనిలో మనేయ మను పట్టణ మొకటి యుండెను. బుద్ధదేవు డిచటనే అనోమానదిని దాటి తనవెంట వచ్చిన సేవకుల వీడ్కొని ననియు, నిచ్చటనే యాయన సన్న్యాసము గైకొనె ననియు గొదరియభిప్రాయము. ఈ ప్రదేశము వైణేయనదికి దగ్గర నుండుటచే ననువైణేయ మనుపేరు వచ్చిన దని కొందరును, వేణువులతో ( వెదుళ్లతో ) నిండియుండున దగుటచే ననువైణేయ మనుపే రొందిన దని కొందరును దలచుచున్నారు.

అనుసాల్వుడు సౌభపతి యైన సాల్వుని తమ్ముడు. సాల్వుని గృష్ణుడు చంపగా నీతడు కృష్ణుని నెట్లయినను జంప నిశ్చయించెను. ధర్మరా దశ్వమేధము జేయుసమయమున గృష్ణుడు కుటుంబసహితముగ హస్తినాపురమునకు రాగా నీతడు సేనాసమేతుడై వచ్చి హస్తినాపురపార్శ్వమున దాగియుండెను. ఒకనాడు కృష్ణుడును, పాండవులును అశ్వమును పరీక్షించుచున్న వారని విని యీతడచ్చటికి నెవ్వరికిని దెలియకుండ వచ్చి క్షణములో నశ్వమును తీసికొని పారిపోయెను. భీముడు సైన్యముతో వానిని దరిమికొని చనియె. ప్రద్యుమ్నుడు, వృషకేతుడును వానిని బట్టి తెచ్చెద మని ప్రతిఙ చేసి పోయిరి. ప్రద్యుమ్ను డోడెను. వృషకేతు డను సాల్వుని నోడించి, బంధించి కృష్ణునొద్దకు దెచ్చెను. వాడు కృష్ణునకు శరణు చొచ్చి, అశ్వమేధమునకు సాయము చేయుటకు నంగీకరించి స్వనగరమునకు బోయెను. (జైమినీయాశ్వమేధము., ఆ. 12-14).

అనుష్ణ - భారతవర్షీయ నది (భార, భీష్మ, అ. 9)

అనుహ్లాదుడు - హిరణ్యకశిపునకు కయాధూ యను భార్యయందు బుట్టిన నల్గురు పుత్రులలో నొక్కడు. ఇతని భార్య సూర్మి. బాష్కలుడు, మహిషుడు అనువారు పుత్రులు.

అనూదయుడు - దృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో నొక్కడు.

అనూపగడము - రాజపుతానాలోని బికానీరు సంస్థానమందలి యొక పట్టణము. ఇందు సంస్థానాధీశ్వరుడగు అనూపసింగు పేర 1678-వ సంవత్సరములో గట్టబడిన కోట గలదు. ఇది బికానీరు పట్టణమునకు 82 మైళ్ల దూరములో నున్నది. డెబ్బదయిదు గ్రామములకిది ముఖ్యపట్టణము. ఇందలి జనసంఖ్య 1,1017. ఇచ్చటి జనులు ముఖ్యముగా 'రాట్' జాతివారు. ఈ ప్రాంతమున నీరు తక్కువగా నున్నను కోతగడ్డి చక్కగ పెరుగును. సోడా ఉప్పు తయారు చేయుటకు కావలసిన 'సజ్జ, లానా' అను చెట్లిచ్చట విశేషముగా బెరుగును.

అనూపదేశము - భారతవర్షీయదేశము. దీని రాజధాని మాహిష్మతి. ఇచ్చట సహస్రకరార్జునుడు రాజ్యము చేయుచుండెను. పాండవుల కాలమున నిచ్చట నీలరాజు రాజ్యము చేయుచుండెను. ఇతడు భారతయుద్ధమునందు పాండవులకై పోరాడి చచ్చెను.

అనూపసింగు - 1. (1640-1660) అమరసింగు కుమారుడు. ఇతడు సింహాసన మెక్కునప్పటికి 6 ఏండ్ల వయసు వాడు. 1650-వ సంవత్సరమున ఓర్ఛారాజగు పహార్&సింగు ఇతనిని