పుట:Andhravijnanasarvasvamupart2.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనులోమవివాహమువలన గలిగిన సంతతికి నొక విశేషమైన హక్కు గలదు. బ్రాహ్మణునకును, శూద్ర స్త్రీకిని పుట్టినవాడు ఏఢు తరములలో బ్రాహ్మణు డగును అని మనువు 10-వ అధ్యాయమునందు చెప్పియున్నాడు; అనగా బ్రాహ్మణునకు శూద్రకు బుట్టిన స్త్రీ మరల బ్రాహ్మణునే వివాహ మాడి, కూతు గనును. ఆ కూతురు గూడ మరల బ్రాహ్మణునే పెండ్లియాడి సంతానము వడయును. ఇట్లేడుతరములవరకును జరిగినయెడల నేడవతరమునందు బుట్టువాడు బ్రాహ్మణు డగును. ఇట్లే బ్రాహ్మణునకు వైశ్యస్త్రీయందు బుట్టువాడు అంబష్ఠుడు. వీడు అయిదు తరములలో బ్రాహ్మణుడగును. ఇట్లు శూద్రుడు బ్రాహ్మణు డగును, బ్రాహ్మణుడు శూద్రత్వమును చెందును. ఇట్లే క్షత్రియునకు వైశ్యునకును బుట్టినవారిని గురించి యెరుగునది.

అనువత్సరము - జ్యోతిశ్శాస్త్రమునుబట్టి యైదు వత్సరములతో గూడుబ యుగములో నాల్గవవత్సరము అనువత్సరమనబడును. సావన, సౌర, చాంద్ర, నక్షత్ర మానముల ననుసరించి వత్సరము లేర్పడును. ఈ సమన్వయముచే నై దువత్సరముల యుగ మొకటి యేర్పడుచున్నది. వీనిలో మొదటిది సంవత్సరము; రెండవది పరివత్సరము; మూడవది ఇద్వత్సరము; నాల్గవది అనువత్సరము; ఐదవది యుగవత్సరము. అనువత్సరమున ధాన్యదానము చేసిన గొప్ప పుణ్యము లభించునట !

అనువాదము ' - వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు ( ' విధ్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63). విధి యనగా విధాయక మని ( ' విధిర్విధాయకః ' 2. 1. 64) గౌతమాచార్యులవారు న్యాయసూత్రము నందు జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాఙాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్న స్పష్టముగా నుండదు. విధివాక్యముచే జెప్పబడినదానిని మరల జెప్పుట అనువాద మనబడును. అనువాదము రెండు విధములు: శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పబడిన మాటల మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. ' అనువాదే చరణానాం ' (2.4.3) అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు ' ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః ' అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును ( సంగతిని ) శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. ' అగ్ని ర్హి మస్య భేషజం ' ( అగ్ని చలికి మందు ) అనునది యనువాదము. ఏల ? ప్రత్యక్షప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్నానమును ఈవాక్య మనువదించినది.

అనువాదము మరల మూడు విధములు. భూతార్థానువాదము, స్తుత్యర్థానువాదము, గుణానువాదము. ' స దేవ సౌమ్యేద మగ్ర ఆసిత్ ' ( ఓ సౌమ్య ! మొదట సత్తే ఉండెను ) అనునది మొదటి దానికుదాహరణము. ' వాయుర్వైక్షేపిష్ఠా దేవతా ' ( వాయువు క్షేపిష్ఠయైన దేవతసుమా ) యన్నది స్తుత్యర్థానువాదము. ' దధ్నా జుహోతి ' ( పెరుగుతో హోమము చేయుచున్నాను ) అనునది గుణానువాదము.

వేదమును నమ్మని బౌద్ధాది పూర్వపక్షులు వేదమునందు నుండు అనువాదవాక్యములు పిష్టపేషణన్యాయమున బునరుక్తములు గనుక వేదమునకు గౌరవహాని కలుగుచున్నది యని యాక్షేపించిరి. అందులకు గౌతమాచార్యులవారు "అనువాదములు పునరుక్తములు కావు. అవే శబ్దములు మాల వచ్చినను వానికి నర్థభేద ముండును. వ్యవహారమునందు మొదట 'గచ్ఛా (పో) అని మరల 'గచ్ఛ, గచ్ఛా (పో, పో) అని దానినే అనువదించినప్పటికిని రెండవ తడవ నుచ్చరించిన 'గచ్ఛ గచ్ఛా పదములకు శీఘ్రముగా పొమ్మని యర్థ మగుచున్నది. అట్లే వైదికము లగు అనువాదములకును విధి వాక్యముల కంటె భిన్నార్థ ముండును. కావున నవి పునరుక్తములు కావు" అని గౌతముడు చెప్పియున్నాడు.