పుట:Andhraveerulupar025958mbp.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చీకటిలోనున్న నూతనపురుషుడు హుంకరించుచు నొఱలోని కత్తిపెరికి కన్నమనాయుని మీదికి వచ్చెను. కన్నమనాయడు కరవాలము దీసికొని నూతనునిపైకి బోయెను. ఇరువురు చాలసేపు భయంకరముగా యుద్ధముగావించిరి. ఇరువురకు దేహమంతయు రక్తమయమయ్యెను. నూతను డాపరానికోపముతో "ఈవ్రేటునకు నీతల తెగ గొట్టనేని నేను బ్రహ్మనాయని తమ్ముడనుగాను" అనిపలికెను. కన్నమనాయ డులికిపడి కత్తినేలపై బడవేసి నూతన పురుషుని పాదములపై బడి, అయ్యా మీరింతకుముందు బ్రహ్మనాయకుని బేర్కొంటిరి. మీ నామధేయమేమి? నేను బ్రహ్మనాయకుని యభిమాన పుత్రుడను. మీవృత్తాంతము వినుటకు నిరీక్షించుచున్నాను" అని పలికెను. నూతనుడు తాను శీలము బ్రహ్మనాయకుని సోదరుడనియు జందవోలు పాలించు రాజులయొద్ద సేనానాయకుడుగ నుండెననియు దనపేరు పేరినీడనియు దెలిపెను. నూతనుని కన్నమనాయడు కౌగిలించుకొని 'తెలియక సంగరమునకు కొరకొంటిని క్షమింపు'మని వేడుకొనెను. పేరినీడు కన్నమనాయనివృత్తాంతము, బాలచంద్రుని సముద్రములో వేయవలసిన పరిస్థితులు దెలిసికొని పరితపించెను. పేరినీడు కన్నమదాసునితో 'బాలకు నన్యాయముగా సముద్రములో వేయుటకంటె బాపము వేఱొండులేదు. నాకొసంగినచో బెంచుకొందును' అనెను. బాలచంద్రుని గన్నమనాయడు పేరినీని కిచ్చి సెలవు