పుట:Andhraveerulupar025958mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్మని యిచ్చెను. కన్నమనీడు చాలవిచారపడి బ్రహ్మనాయకుని మాటకు బదులుచెప్పజాలక సభ్యులే నివారింతు రేమోయని వారల విచారకరములు, ప్రార్థనాపూర్వకములగు చూపులతో జూచెను. సభ్యులందఱును బ్రహ్మనాయకునియాజ్ఞను సత్వరముగా నెరవేర్పుమని కన్నమనాయకుని బ్రోత్సహించిరి. బ్రహ్మనాయకుడు తొందరపెట్టెను. కన్నమనాయకుడు 'కనులుదెఱువని పసికందును అన్యాయముగా జంపవలసి వచ్చినదే! ఈపసిపాపని కాపాడ జాలని నాబ్రదుకు గాల్పనా? నే నస్వతంత్రుడను. జనకుడగు బ్రహ్మనాయకుని ఆజ్ఞకు వ్యతిరేకము జరుపదగదు. అనుకొనుచు బ్రహ్మనాయకుని కనుసన్నల ననుసరించి సముద్రతీరమునకుబోవ చందవోలునకు బ్రయాణమయ్యెను. రాజమందిరమునందును పట్టణమునందును బ్రహ్మనాయకుని గృహంబునను నాడు విచారమునకు మేరలేకుండెను. కన్నమనాయకుడు మండువేసంగిలో బాలునొక తొట్టెలోనుంచికొని పైనిగుడ్డలుకప్పి త్రోవకడ్డమగు ప్రతిగ్రామము నందును, బాలిప్పించుచు గొంతసేపటికి జందవోలు చేరెను. ఆకాలమున గల నగరరాజములలో చందవోలు ప్రఖ్యాతమైనది. చుట్టును బ్రాకారములు, కోటలు కలవు. క్రొత్తవాడెవ్వడు నగరమున నడుగుబెట్ట వీలులేక పోవుటచే గన్నమనాయడు బాలకునెటులో నగరముబయటనుండి సముద్రతీరమునకు జేర్చెను. జాముప్రొద్దు పోయెను. అంధకారము