పుట:Andhraveerulupar025958mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలుడని కొంచెమేని సంశయింపక దాదులచే బాలిప్పించుచు బెంచుచుండెను. సంతానములేదను కొఱతను దిగనాడి యాపుణ్యదంపతు లాబాలకునితో గాలయాపనము జేయుచు నొక శుభలగ్నమున నాతనికి కన్నమదాసుడని నామకరణము గావించిరి. కొంతకాలమునకు గన్నమదాసుడు పెద్దవాడై పాఠాలలకేగి సమస్తవిద్యల నభ్యసించిన పిదప గరిడీ సాము వ్యాయమములు గూడ నేర్చుకొని జెట్టియయ్యెను. వర్ణాశ్రమ ధర్మములకు మిగుల బట్టుగల యాకాలమున బ్రహ్మనాయకుడు పంచముని జేరదీసెనని నిందింపసాగిరి. కొందఱు కన్నమనాయనియెడ నకారణద్వేషము ప్రకటించుచుండిరి. ఎందఱెన్ని విధముల నాందోళన పడుచున్నను పుణ్యదంపతులగు ఐతమ్మయు, బ్రహ్మనాయకుడు మాత్రము పుణ్యభావముతో నాబాలుని జూచుచుండిరి. కొంతకాలమునకు ఐతమ్మ గర్భవతియయ్యెను. బ్రహ్మనాయని యానందమునకు మేరయేలేదు. సంతోష సూచకముగా మాచెర్ల చెన్నకేశవున కెన్నియో ఉత్సవములు, వేడుకలు చేయించి నాయడు మహావైభవముగా సీమంతోత్సవము జరిపించెను. శుభముహూర్తమున ఐతమ్మకు జక్కనికుమారుడు జన్మించెను. బాలచంద్రునివలె బ్రకాశించు నాకుమారరత్నమునకు బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని నామకరణము గావించి శాస్త్రపారంగతులగు బ్రాహ్మణోత్తముల రావించి బాలుని