పుట:Andhraveerulupar025958mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాధారముగ జేసికొని వీరశైవమతము మిగుల వ్యాప్తిలోనికి దెచ్చెను. మతావేశపరశుడగు నీసోమనాధుడు జైనుల బౌద్ధుల జంపించె నని స్థానికచరిత్రములందు గలదు. ఇతని గ్రంథములు పరమతదూషణము, స్వమతస్తుతి గలవి గాని నీతనియెడ నారోపించిన దోషము లాకాలపు జరిత్రము సమగ్రముగా నెఱింగిన వారికి సత్యములని తోచుటకు సంశయ ముండదు. రుద్రదేవునియొద్ద సేనా నాయకులుగ నున్న బేతిరెడ్డి, నామిరెడ్డి, రుద్రదేవ సేనాని లోనగు వీరుల చరిత్రము సమగ్రముగ దెలిసికొనవలసి యున్నది. రుద్రదేవుని సోదరుడు మహాదేవరాయలు మూడుసంవత్సరములు రాజ్యము పాలించినటుల జరిత్రములందు గలదు. రుద్రదేవుడు జీవించియుండగా శౌణదేశాధీశ్వరుడును యాదవ నరపాలకుడునగు జైత్రపాలుడు త్రిలింగదేశము మీదికి దండెత్తి వచ్చినపుడు మహాదేవరాయ లెదిరింపబోయి మడిసినటుల జరిత్రములందు గలదు. శాసనము లందు రుద్రభూపాలుని యనంతరము రాజ్యము పరాదీనము కాగా వీరవతంసుడగు రుద్రసేనాని పునరుద్ధరించినటుల గన్పట్టుచున్నది. మహాదేవరాయలు జీవించి యనంతరము మూడుసంవత్సరములు రాజ్యమును బాలించినదే సత్యమైనచొ రుద్రదేవుని యనంతరము రాజ్యము పరాధీనము గావలసిన యవసరములేదు గావున మహాదేవ